For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ టేస్టీ కార్న్ బిర్యానీ

|

కార్న్ (మొక్కజొన్న)తో కాల్చి లేదా ఉడికించి లేదా సూప్ చేసుకొని తింటుంటారు. శీతాకాలంలో హాట్ కార్న్ కోసం స్టాల్స్ చుట్టూ తిరుగుతుంటాం. మనలో చాలా మంది కార్న్ ను ఈవెనింగ్ స్నాక్ గా తింటుంటారు. అంతే కాదు మన ఇంటికి వచ్చిన మన ఫ్రెండ్స్ కూడా కాఫీ మరియు టీ తో పాటు హాట్ కార్న్ ను సర్వ్ చేస్తుంటాం. కార్న్ మంచి స్నాక్ మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులో అధికంగా విటమిన్స్ ఉండి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది.

కార్న్ తో వివిధ వెరైటీ వంటలు తయారు చేసి తింటారు. కాబట్టి మనం కూడా ఓ మంచి వెరైటీ వంట..అదే కార్న్ బిర్యానీ రుచి చూద్దాం...

Healthy Corn Biryani Recipe
కావల్సిన పదార్థాలు:
కార్న్(మొక్కజొన్న): 1½ cup
ఉల్లిపాయ: 1 large(chopped)
టమోటో: 2(finely chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి: 5(chopped)
నూనె: 3tbsp
నెయ్యి: 3tbsp
కొబ్బరి పాలు: 1cup
నీళ్ళు: 3 cups
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 2tsp
పసుపు: ½ tsp
కొత్తిమీర : 2(chopped)
పుదీనా : 4 leaves(chopped)
గరం మసాలా: 2tsp
బిర్యానీ ఆకు: 1
చెక్క: 2
లవంగాలు :5
యాలకులు :3
బాస్మతి రైస్: 2 cups

తయారు చేయు విధానం:
1. ముందుగా రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మందపాటి డీప్ బాటమ్ పాత్రను స్టౌ మీద పెట్టి ఆయిల్ , నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, చెక్క, లవంగాలు మరియు యాలకులు వేసి వేయించాలి.
3. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు రంగు మారే సమయంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు టమోటో వేసి, టమోటో మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత మొక్కజొన్న గింజలు, పసుపు, కారం, కొబ్బరి పాలు మరియు ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు వేయించాలి. ఈ మిశ్రమం అంతా చిక్కబడేంత వరకూ వేయించుకోవాలి.
6. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసి ఈ గ్రేవీని బాగా ఉడికించాలి. తర్వాత ఇందులో బాస్మతి బియ్యాన్ని, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి బాగా ఉడికించాలి. అంతే కార్న్ బిర్యానీ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

కార్న్ బిర్యాని రైతా లేదా వెజిటేబుల్ గ్రేవీతో సర్వ్ చేయాలి.

English summary

Healthy Corn Biryani Recipe | హెల్తీ అండ్ టేస్టీ కార్న్ బిర్యానీ


 Who does not want to have corns, be it the baked corns, the bhuttas or even corn soups. In winters we all rush to the makeshift stalls to grab a bite on the delicious hot corn. Many of us have corn for evening snacks and savour the corn with a hot cup of tea or coffee. At the same time corn is considered to be a healthy snack and high in nutrition, which are extremely beneficial for you. Corns are basically rich in Vitamins which helps in physiological functions and fight diseases too.
Story first published: Tuesday, February 19, 2013, 11:14 [IST]
Desktop Bottom Promotion