For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ పన్నీర్ మంచూరియన్ రిసిపి

|

మన డైలీ మీల్స్ లో మిల్క్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్ ఒక భాగం. డైరీ ప్రొడక్ట్స్ లో పనీర్ కూడా ఒకటి. పనీర్ తో వివిధ రకాల వంటలను తయారు చేయవచ్చు. పన్నీర్ తో తయారు చేసే అన్ని రకాల వంటలు అద్భుతమైన రుచిని మరియు ఫ్లేవర్ ను కలిగి ఉంటాయి.

పన్నీర్ తో తయారు చేసే వంటకాలు చెప్పలేన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మేము పనీర్ తో సులభంగా తయారు చేసే వంటకాన్ని ఎంపిక చేసుకొన్నాం. ఈ సింపుల్ పనీర్ మంచూరియన్ రిసిపిని ఇండో చైనీస్ స్టైల్లో తయారు చేయవచ్చు. ప్రస్తుత రోజుల్లో మనం అందరూ మన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తపడుతున్నాం. కాబట్టి ఈ హెల్తీ పనీర్ మంచూరియన్ వివిధ రకాల గ్రీన్ వెజిటేబుల్స్ తో తయారు చేయవచ్చు. చాలా తక్కువ నూనె ఉపయోగించి తయారు చేసే వంటకం చాలా తేలికగా కూడా జీర్ణం అవుతుంది. మరి ఈ పనీర్ రిసిపిని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

పన్నీర్: 250grm(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
కార్న్ ఫ్లోర్: 3tbsp
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్ : 1tsp
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
స్ప్రింగ్ ఆనియన్స్: 1కట్ట(సన్నగా కట్ చేసుకోవాలి)
సోయా సాస్: 2tbsp
టమోటో సాస్: 2tbsp
వెల్లుల్లి: 3రెబ్బలు(సన్నగా తరుగుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నీళ్ళు : 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు మరియు అరకప్పు నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి.
2. తర్వాత ఈ పేస్ట్ ను పన్నీర్ ముక్కలకు బాగా పట్టించాలి.
3. తర్వాత ఒక టేబుల్ స్సూన్ నూనెను నాన్ స్టిక్ పాన్ లో వేసి, అందులో పన్నీర్ క్యూబ్స్ ను వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ 5నిముషాలు వేగించుకోవాలి.
4. బ్రౌన్ కలర్ లో వేగిన పన్నీర్ క్యూబ్స్ ను ఒక ప్లేట్ లోని తీసికొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.
5. తర్వాత అదే పాన్ లో కట్ చేసుకొన్న వెల్లుల్లి రెబ్బలు, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ మరియు ఉప్పు కూడా చేర్చి, మూడు నాలుగు నిముషాలు ఫై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే టమోటో సాస్ మరియు సోయా సాస్ మిక్స్ చేసి మరో రెండు నిముషాలు పేస్ట్ చేసుకోవాలి.
7. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను ప్లేట్ లో వేసి, అరకప్పు నీళ్ళు పోయాలి, మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పాన్ లో పోయాలి. తర్వాత ఈ మిశ్రమం చిక్కగా మారుతుంది.
8. ఈ మిశ్రమం చిక్కగా మారే సమయంలో ముందుగా వేగించి పెట్టుకొన్న పన్నీర్ క్యూబ్స్ ను అందులో వేయాలి. పన్నీర్ వేసిన తర్వాత నిదానంగా మిక్స్ చేయాలి. లేదంటే పన్నీర్ ముక్కలు విడిపోతాయి. ఇలా పూర్తిగా మిక్స్ చేసి 5నిముషాలు సిమ్ లో పెట్టి తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి.

English summary

Healthy Paneer Manchurian Recipe


 Milk and milk products are a part of our daily meal. Paneer especially is a much loved dairy product in most of the households. It can be cooked using many different ingredients since it absorbs almost every flavour and tastes extremely delicious in all its forms.
Story first published: Thursday, June 27, 2013, 12:49 [IST]
Desktop Bottom Promotion