For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ టమోటో సేవియా : బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

బ్రేక్ ఫాస్ట్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. అన్నింటిలోకి చాలా సులభంగా త్వరగా అయ్యే అల్పాహారం. సేమియా వంటకం. ఇటు స్వీటు కానీ..అటు హాట్ కానీ ఎదైనా సరై అతి త్వరగా తయారయ్యే వంటకం సేమియా వంటకం. సేమియాతో రకరకాల రుచిలు చేస్తుంటా. సేమియా పాయసం, సేమియా చాట్, సేమియా ఉప్మా ...చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా త్వరగా అయిపోయే టేస్టీ టిఫిన్ సేమ్యా ఉప్మా.

ఉప్మాలో వెరైటీ ఉప్మా సేమ్యా ఉప్మా..ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు..ఈవెనింగ్ స్నాక్ కూడా . చేయడం చాలా సింపుల్..కలర్ కలర్ గా కనిపించే ఈ వెరైటీ బ్రేక్ ఫాస్ట్ చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తినేస్తారు. టమోటో సేవియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

సేమియా: 1pack

ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటో: 3(సన్నగా కట్ చేసుకోవాలి)

పసుపు: 1/4tsp

సాంబార్ పౌడర్/కారం: 2tsp

ఇంగువ: 1/4tsp

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

ఉప్పు: రుచికి సరిపడా

నెయ్యి: 1tsp

నూనె: 1tbsp

పోపుకోసం :

ఉద్దిపప్పు: 1tsp

జీలకర్ర: 1/2tsp

ఆవాలు: 1/2tsp

కరివేపాకు :కొద్దిగా

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

1. ముందుగా సేమియాను అవసరం అయినంత తీసుకొని, 5నిముషాలు వేడి నీళ్ళలో వేసి వంపేసి పక్కన పెట్టుకోవాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉద్దిపప్పు, జీలకర్ర మరియు ఆవాలు వేసి వేగనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల, ఇంగువపొడి మరియు కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకోవాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

3. ఉల్లిపాయలు గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారగానే టమోటో, ఉప్పు, పసుపు మరియు సాంబార్ పౌడర్ మరియు కారం వేసి బాగా మిక్స్ చేయాలి . టమోటో మెత్తబడే వరకూ మ్యాష్ చేస్తూ ఉడికించుకోవాలి.

4. టమోటోలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా వేడినీళ్ళలో ఉడికించి పెట్టుకొన్ని సేమియాను వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.

English summary

Healthy Tomato Sevai Recipe For Breakfast

Tomato Sevai is one of those dishes which is seen in almost every South Indian home at the time of breakfast. The only reason why many love to prepare this recipe is because it is easy to prepare. Especially for working women, this yummy tomato sevai takes just 20 minutes of their time.
Story first published: Saturday, May 30, 2015, 11:00 [IST]
Desktop Bottom Promotion