For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ పనీర్ జల్ ఫ్రీజ్ : వీకెండ్ స్పెషల్

|

పనీర్ జల్ ప్రీజి రిసిపి చాలా సింపుల్ రిసిపి. సింపుల్ మాత్రమే కాదు, టేస్టీ కూడా. పనీర్ జల్ ఫ్రీజ్ రిసిపి అంటే వెజిటేబుల్స్ కు హాట్ అండ్ స్పైస్ సాస్ ను మిక్స్ చేసి స్టెయిర్ ఫ్రై చేసి, చిక్కటి గ్రేవీలా తయారుచేయడం. పనీర్ సబ్జీలలో వివిధ రకాల వంటలున్నాయి. వాటిలో పనీర్ జల్ ఫ్రీజ్ ఒకటి . ఈ డిష్ ను మన ఇండియన్ రెస్టారెంట్స్ లో ఫేమస్ గా మరియు రెగ్యులర్ గా సర్వ్ చేస్తుంటారు.

ఈ వంటను తయారుచేయడానికి ముందు వెజిటేబుల్స్ ను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి తర్వాత సపరేట్ గా కొన్ని మసాలాలు మరియు సాస్ లు వేసి చిక్కటి గ్రేవీలా తయారుచేయడమే పనీర్ జల్ ఫ్రీజ్. ఇలాంటి వంటలను వీకెండ్స్ లో ట్రై చేస్తే ఒక కొత్త వంటను రుచి చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారుచేయాలి. ఏమేమి అవసరం అవుతాయో చూద్దాం...

Hot and Spicy Paneer Jalfrezi Recipe: Weekend Special

కావల్సిన పదార్థాలు:
పనీర్: 150grm(కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి)
క్యారెట్: 1/4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి
టమోటో గుజ్జు: 1/4 cup
జీలకర్ర: 1/2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tbsp
టమోటో కెచప్ : 1 tbsp
కారం: 1 tsp
పసుపు: 1/8 tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాల: 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: సరిపడా
కొత్తిమీర తరుగు: 2 tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యారెట్ , క్యాప్సికమ్, మర్చి, టమోటో మరియు పన్నీర్ సన్నగా పొడవుగా కొద్దిగా మందంగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర, వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకూ వేగించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత అందులో క్యారెట్, క్యాప్సికమ్, వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. అలాగే టమోటో మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు టమోటో గుజ్జు కూడా అందులో వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో టమోటో కెచప్, కారం, పసుపు, ధనియాలపొడి, గరం మసాలా మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులో 1/3కప్పు వాటర్ వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
8. తర్వాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి.
9. గ్రేవీ చిక్కబడే వరకూ మీడియం మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి. మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, 5నిముషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని, కొత్తిమీర తరుగును గార్నిష్ గా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Image Coutresy: great-secret-of-life

English summary

Hot and Spicy Paneer Jalfrezi Recipe: Weekend Special

In its original preparation, it is nothing but stir fried vegetables in a sauce like hot and spicy thick gravy. Over time it has evolved to have many different variations and paneer jalfrezi is one of the famous and routinely served dish in Indian restaurants.
Desktop Bottom Promotion