For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ తో మజా చేయండి...

|

ఎండాకాలంలో చల్లచల్లని సలాడ్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యం మాత్రమే కాదు, రుచికి కూడా బాగుంటాయి. పండ్లు తినని పిల్లలకు సలాడ్ ల రూపంలో చేసి పెట్టండి. తియ్య తియ్యగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్ లలో పోషక విలువలు కూడా అధికం. వేసవి తాపానికి భోజనం చేయాలన్నా, చపాతీలు తిన్నాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముందుగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకున్న ఈ సలాడ్ లను బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లగా తింటుంటే ఆ మజానే వేరు.. మరి మీరు ఈ సలాడ్ ల రుచి ఏమిటో ఒక సారి చూడండి...

How to make Fresh Fruit Salad

కావలసిన వస్తువులు:
దానిమ్మ గింజలు : 1cup
ద్రాక్షపళ్లు : 1cup
పైనాపిల్‌ ముక్కలు : 1cup
అరటిపండు ముక్కలు : 1cup
చెర్రీ పండ్లు : 1/2cup
మామిడిపండు ముక్కలు : 1cup
ఆపిల్‌ పండు ముక్కలు : 1cup
కమలాతొనలు : 1cup
మిరియాలపొడి : 1/2tsp
ఉప్పు : సరిపడినంత
తేనె : 1/4cup
నిమ్మ రసం : 2tsp

తయారు చేసే విధానం:
1. ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
2. తర్వాత ఈ పండ్ల ముక్కల మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటల పాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్‌ సలాడ్‌ రెడీ.
3. ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీని వలన శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి.

English summary

How to make Fresh Fruit Salad | సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ తో మజాయే మజా...

This fruit salad combines chopped peaches, strawberries, bananas, and red and green grapes, dressed with a simple fresh lime and pineapple juice dressing.
Story first published: Monday, April 15, 2013, 12:33 [IST]
Desktop Bottom Promotion