For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వయంగా ఇంట్లో తయారుచేసుకునే రవ్వ ఇడ్లీ రిసిపి

మీరు డైట్ పాటించేటపుడు లేదా తేలికపాటి ఆహరం తీసుకోవాలి అనుకున్నపుడు, చిన్న చిన్న రవ్వ ఇడ్లీలు చేసుకోండి. అందువల్ల, రవ్వ ఇడ్లీ తయారుచేయడంలో తేలికపాటి పద్ధతులను చదవండి. ఇక్కడ మీరు తేలికగా, త్వరగా రవ్వ ఇడ

By Lekhaka
|

మీరు దక్షిణ భారత వంటల అభిమాని అయితే, ఇడ్లీలు మిమ్మల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి. మీరు ఆరోగ్యకరమైన అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ కోసం ఎదురు చూస్తుంటే, ఇడ్లీ ఒక అద్భుతమైన ఎంపిక. మీరు ఇడ్లీని తయారుచేయడానికి ఎక్కువ సమయం పడుతు౦ది అనుకుంటే, రవ్వ ఇడ్లీ ఈ ప్రచారాన్ని విచ్చిన్నం చేసే శీఘ్ర వంటకం. ఇంట్లోనే రవ్వ ఇడ్లీలను శీఘ్రంగా ఎలా తయారు చేసుకోవాలో ఇవ్వబడింది.

దీనికి మహాఅయితే 10-12 నిమిషాల సమయం పడుతుంది, మీరు హడావిడిగా బైటకు వెళ్ళాలి అనుకున్నపుడు, అల్పాహారం చేయడానికి ఏమీ లేనపుడు ఇది ఖచ్చితంగా ఒక మంచి ఎంపిక.

దీన్ని మీరు మీ పిల్లలకు అల్పాహారంగా కానీ లేదా భోజనంలో కూడా ప్యాక్ చేయవచ్చు. రెసిపీ మొత్తం చాలా ఆరోగ్యకరమైనది; మీరు డైట్ పాటించేటపుడు లేదా తేలికపాటి ఆహరం తీసుకోవాలి అనుకున్నపుడు, చిన్న చిన్న రవ్వ ఇడ్లీలు చేసుకోండి. అందువల్ల, రవ్వ ఇడ్లీ తయారుచేయడంలో తేలికపాటి పద్ధతులను చదవండి.

ఇక్కడ మీరు తేలికగా, త్వరగా రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు, చేసే విధానం ఇవ్వబడ్డాయి. చదివి తెలుసుకోండి.

సర్వ్ చేయడానికి – 5 ఇడ్లీలు

సర్వ్ చేయడానికి – 5 ఇడ్లీలు

తయారుచేసుకోడానికి పట్టే సమయం - 15 నిముషాలు

వండడానికి పట్టే సమయం - 10 నిముషాలు

కావాల్సిన పదార్ధాలు:

కావాల్సిన పదార్ధాలు:

పిండి కోసం

1.సేమోలిన (రవ్వ) - 1 కప్పు

2.పెరుగు - పావు కప్పు

3.కొత్తిమీర ఆకులు - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)

4.ఫ్రూట్ సాల్ట్ - ¾ టేబుల్ స్పూన్

5.రుచికి సరిపడా ఉప్పు

ఇతర దార్ధాలు

ఇతర దార్ధాలు

6.నూనె - టేబుల్ స్పూన్

7.నెయ్యి - ½ టేబుల్ స్పూన్

8.మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్

9.ఆవాలు - ½ టేబుల్ స్పూన్

10.జీడిపప్పు - 1టేబుల్ స్పూన్ (ముక్కలు)

11. జీలకర్ర - ½ టేబుల్ స్పూన్

12. కరివేపాకు ఆకులు - 4

13. పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)

14. చిటికెడు ఇంగువ

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

1.ఒకపెద్ద గిన్నె తీసుకుని అందులో సేమోలినా రవ్వ, పెరుగు, ఉప్పు కలపాలి. ఇప్పుడు, అందులో నీళ్ళు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.

2.ఇప్పుడు, వంటకాన్ని సిద్ధం చేసే సమయం. ఒక చిన్న పాన్ తీసుకుని నూనె వేడిచేయాలి. అందులో నెయ్యి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీడిపప్పు, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేయించాలి.

3.అన్నీ బాగా వేగాక, ఈ మిశ్రమాన్ని ఆ పిండిలో వేసి, బాగా కలపాలి. అందులో కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసి, కొద్దిగా నీళ్ళు చిలకరించాలి. ఆ పిండి ఉబ్బటం ప్రారంభిస్తుంది. మళ్ళీ బాగా కలపాలి.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

4.ఇప్పుడు, ఇడ్లీ స్టాండ్ తీసుకుని, వాటికి నూనె రాయాలి. ఇడ్లీ ప్లేట్లలో కొద్దికొద్దిగా పిండిని వేసి, ఆ ఇడ్లీ స్టాండ్ నీ స్టీమర్ పై పెట్టాలి.

5.అది ఉడకడానికి 7-8 నిమిషాలు పడుతుంది. ఒక చెంచాతో ఇడ్లీలను బైటికి తీసి, ఒక పళ్ళెంలో పెట్టండి.

6.వడ్డించడానికి వేడి వేడి రవ్వ ఇడ్లీ సిద్ధం. దీన్ని మీరు సాంబార్, కొబ్బరి చెట్నీతో వడ్డించ వచ్చు.

ఈ అద్భుతమైన వంటకాన్ని ఇంట్లోనే తయారుచేసి మీ స్నేహితులకు పెట్టండి. దీనిపై మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి.

English summary

How To Make Quick Rava Idli At Home

This quick rava idli recipe will help you prepare breakfast in a few minutes for the days you are running short of time, take a look.
Story first published: Thursday, December 15, 2016, 12:25 [IST]
Desktop Bottom Promotion