For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ స్పెషల్ దహీ బెండీ మసాలా

|

సౌత్ ఇండియన్ వంటకాల్లో బెండకాయ మసాలా చాలా పాపులర్. బెండకాయను వివిధ రకాలుగా..వివిధ పద్థతుల్లో తయారుచేవచ్చు. వీటన్నింటి పూర్తి విరుద్దుమైన మరియు ఓ అద్భుతమైన రుచితో తయారుచేయబడింది. ఈ బేండి మాసాలకు క్రీమీ మరియు కొద్దిగా పుల్లగా ఉండే ఈ బేండి మసాలా చాలా అద్భుతంగా ఉంటుంది.

దీన్ని హైదరాబాదీ దహీబెండీ మసాలా అంటారు. హైదరాబాద్ దహీ బెండీ మసాలాను పెరుగుతో తయారుచేస్తారు. చిక్కగా ఉండే పెరుగు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఈ వంటకు మరింత అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది. తాజాగా ఉండే కరివేపాకు పోపులో వేగించడంలో ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవేకాక, ఈవంటకు చాలా తక్కువ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల వెజిటేరియన్స్ కు చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది. మరి ఈ స్పెషల్ హైదరాబాద్ దహీ బెండీ మసాలా ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Hyderabadi Dahi Bhindi

బెండకాయలు(లేడిస్ ఫింగర్స్): 1/2kg
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటాలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు: 1cup
కొబ్బరి తురుము: 1tbsp
జీడిపప్పు: 8
గరం మసాలా: 1tsp
కారం: 1tsp
పసుపు: ½tsp
మామిడి పొడి: 1tsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1cup

పోపు కోసం:
ఆవాలు: 1tsp
జీలకర్ర: ½tsp
ఉద్దిపప్పు: ½tsp
ఎండు మిరపకాయలు: 2-3
హింగ్ (ఇంగువ): ఒక చిటికెడు
కరివేపాకు: 6-7
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పొడి కాటన్ వస్త్రంతో తుడిచి తడి ఆరిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత జీడిపప్పును గోరువెచ్చని నీటిలో 10నిముషాలు నానబెట్టుకొని, కొబ్బరి తురుముతో పాటు, నానబెట్టుకొన్న జీడిపప్పును కూడా వేసి మెత్తని పేస్ట్ లా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనెను పాన్ లో వేసి, ముక్కలుగా కట్ చేసుకొన్ని బెండకాయల ముక్కలను అందులో వేసి 5 నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వాటిని మరో ప్లేట్ లోనికి మార్చుకొని పక్కన పెట్టి, చల్లారనివ్వాలి.
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి, చిటపటలాడాక అందులో జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉద్దిపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒకనిముషం వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, మూడు నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు డ్రైమ్యాంగో పౌడర్, కారం, గరం మసాలా పౌడర్, పసుపు, వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు కూడా వేసి మరో 3-4నిముషాలు వేగించి, టమోటో మెత్తబడ్డాక జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
8. తర్వాత ఇందులోనే పెరుగు, ఉప్పు వేసి ఒక నిముషం బాగా మిక్స్ చాయాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
9. ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకొన్న బెండకాయ ముక్కలను వేసి మూత పెట్టకుండా 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
10. అంతే, 5నిముషాల తర్వాత బెండకాయ ఉడికిందో లేదో నిర్ధారించుకొని, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే హైదరాబాద్ దహీ బేండీ మసాలా రెడీ. అంతే దీన్ని వేడి వేడి అన్నం మరియు రోటితో సర్వ్ చేయవచ్చు.

English summary

Hyderabadi Dahi Bhindi Masala

Bhindi masala is a popular recipe. There are a number of versions of the recipe. However here we have a entirely different and delicious vegetarian recipe of bhindi masala with a creamy and tangy twist.
Story first published: Saturday, September 21, 2013, 14:32 [IST]
Desktop Bottom Promotion