For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ స్టాంట్ అండ్ ఈజీ ఆనియన్ రైస్ రిసిపి

|

ఆనియన్ రైస్ ఒక రుచికరమైన సౌత్ ఇండియన్ క్విక్ అండ్ ఈజీ రైస్ రిసిపి. ఈ వంటను మీరు ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఆనియన్ రైస్ చాలా సులభంగా, చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు.

ఆనియన్ రైస్ రిసిపి హెల్తీ మరియు న్యూట్రీషియన్స్ కలిగి తక్కువ క్యాలరీలను కలిగి ఉన్నది. మరి మీరు చాలా త్వరగా ఏదైనా సింపుల్ గా టేస్టీగా తయారుచేసుకోవాలనుకుంటే ఈ ఆనియన్ రైస్ రిసిపిని ప్రయత్నించవచ్చు. ఉల్లిపాయలు మరియు ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేసే ఈ రైస్ రిసిపి చాలా టేస్టీగా మరియు ఆరోమాటిక్ గా ఉంటుంది. మరి ఈ సింపుల్ రిసిపిని మీరు కూడా ప్రయత్నించాలంటే మరి ఎలా తయారుచేయాలో చూడండి....

Instant & Easy Onion Rice Recipe

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 2cups
ఉల్లిపాయలు : 2(సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 2(దంచుకోవాలి)
ఆవాలు: 1/2tbsp
పచ్చిమిర్చి: 2-3
పెప్పర్: 2tbsp
నూనె: 3tbsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడిచేయాలి.
3. నూనె వేడయ్యాక అందులో ఆవాలు వేసి ఒక సెకను వేగించాలి.
4. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి ఒకదానికి తర్వాత ఒకటి వేసి 5నిముషాలు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం, రుచికి సరిపడా ఉప్పు మరియు పెప్పర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
6. ఇలా మొత్తం మిశ్రమం మిక్స్ చేసిన తర్వాత కొద్ది సమయం అలాగే ఉంచాలి. దాని వల్ల రైస్ టేస్టీగా ఆరోమా వాసన కలిగి ఉంటుంది.
7. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, నిమ్మరసం చిలకరించి, బాగా మిక్స్ చేయాలి. అంతే రుచికరమైన ఉల్లిపాయ రైస్ రిసిపి రెడీ. ఈరైస్ రిసిపిని ఆవకాయ లేదా లెమన్ పికెల్ తో సర్వ్ చేయవచ్చు.

English summary

Instant & Easy Onion Rice Recipe

Onion rice is a South Indian delicacy that is quick and easy to make. You might have tried this dish at home. Onion rice is an easy and fast dish that you can make it for supper today.
Story first published: Tuesday, October 28, 2014, 18:05 [IST]
Desktop Bottom Promotion