For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడైదాల్ తడ్కా: స్పెషల్ ఇండియన్ రిసిపి

|

దాల్ తడ్కా ఒక ఫేమస్ డిష్. ఈ దాల్ తడ్కాను ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ దాల్ తడ్కా రిసిపి హాట్ తందూరి రోటీలకు ఫర్ఫఎక్ట్ కాంబినేషన్ . ఈ దాల్ తడ్కా రిసిపి రెస్టారెంట్ టాప్ ఫుడ్స్ లో ఒది ఒక ఆథెంటిక్ రిసిపి. ఈ రిసిపిని సాధారణంగా కందిపప్పుతో తయారుచేస్తారు. ఈ రిసిపి కాస్తా కారంగా మరియు టేస్టీగా ఉండేటటువంటి ఇండియన్ కుషన్ రిసిపి.

వీకెండ్ స్పెషల్ కడై పనీర్: వెజిటేరియన్ స్పెషల్:క్లిక్ చేయండి

దాల్ తడ్కా రిసిపి సులభమైన ఇండియన్ రిసిపి. ఈ వంటకు అసలైన రుచి అంతా పప్పును లైట్ బ్రౌన్ కలర్ లో వేయించి తర్వాత తయారుచేయడ వల్ల అంత రుచి వస్తుంది. మరి ఈ రుచికరమైన దాల్ తడ్కాను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Kadi Dal Tadaka-Special Indian Recipe
కావలసినవి
కందిపప్పు : 100grm
నూనె : 25grm
నెయ్యి : 10grm
ఆవాలు : 1tsp
జీలకర్ర : 1tsp
ఎండుమిర్చి : 4
పసుపు : చిటికెడు
మిరప్పొడి : 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
పచ్చిమిర్చి : 4
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : రెండు రెమ్మలు
ఇంగువ : కొద్దిగా
అల్లం తరుగు : కొద్దిగా
వెల్లుల్లి తరుగు : కొద్దిగా
టొమాటో తరుగు : 1/2cup

స్పైసీ కడై చికెన్ - చపాతి: క్లిక్ చేయండి

తయారుచేయు విధానం:
1. కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి.
2. టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి.
3. కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి.
4. బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి, అందులో పప్పు వేసి కలిపి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేయాలి.

English summary

Kadi Dal Tadaka-Special Indian Recipe

Dal tadka is a famous dish very well liked in India. This dal tadka recipe is your perfect companion for hot tandoori roties. Dal tadka is one of the first few delicacies that will cross your mind when you are sitting in an authentic Indian restaurant. But you can easily replicate it in the privacy of your home with this easy dal tadka recipe. It is basically a toor dal recipe that is spicy and rich in all flamboyance of Indian cuisine.
Desktop Bottom Promotion