For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాజు మష్రుమ్ మసాలా : రాఖీ పండుగ స్పెషల్

|

రక్త సంబందానికి రూపం రక్షా అత్మీయ బందానికి ఆదారం రాఖీ ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువుల తీయటి జ్ఞాపకం రక్షాబందన్‌ తరాలుమారిన తరగని వన్నేతో తారతమ్యం లేకుండా జరుపుకుంటున్న పండుగ రక్షాబందన్‌. తోబుట్టువుల అప్యాయత అనురాగం ఎప్పటికి ఎవ్వరు మరువలేరు ఈ అనుబంధానికి ప్రతికగా నిలిచే శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేశవ్యాప్తంగా పండుగరోజు అన్నదమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు తప్పకుండా రాఖీలు కట్టాలని ఆరాటపడుతుంటారు.

అత్మీయతను పెంచే బందం మరింత బలపడాలంటే రక్షాబందన్ తో పాటు నోటికి కమ్మని రుచికరమైన వంటను రుచిచూపించాల్సిందే. ఎప్పడూ రెగ్యులర్ గా చేసుకొనే వంటలు కాకుండా, ప్రత్యేకంగా ఇలా శుభకార్యాలప్పడు డిఫరెంట్ వంటలను తయారుచేసుకుంటే ఆ అకేషన్ కే మరికొంత అనందం, ఆహ్లాదం తోడవుతాయి. మరి మీ తోబుట్టువులకు, అన్న, తమ్ములకు రక్షాబందన్ రోజున ప్రత్యేకంగా ఉండాలంటే ఒక స్పెషల్ వంటను రుచి చూపించండి. అందుకోసం మేము ఇక్కడ ఒక స్పెషల్ మష్రుమ్ కర్రీని పరిచయం చేస్తున్నాం. తయారుచేసే విధానం క్రింది విధంగా ఉంది...

Kaju Mushroom Masala For Rakshabandhan

బటన్ మష్రుమ్: 1cup
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం పొడి: 1tsp
పసుపు పొడి: 1tsp
పెరుగు: 1/2cup
జీడిపప్పు పేస్ట్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క :1
యాలకలు: 4
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బటన్ మష్రుమ్ ను వేడి నీటిలో శుభ్రంగా కడగాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్రచ దాల్చిన చెక్క, యాలకలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. వెంటనే పసుపు, జీలకర్ర పొడి, కారం, జీడిపప్పు పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి.
6. తర్వాత ఒక బౌల్లో పెరుగు వేసి గిలకొట్టి తర్వాత, దాన్ని పాన్ లో పోసి, మొత్తం మిశ్రమాన్ని నిదానం కలియబెట్టాలి.
7. ఒక నిముషం తర్వాత బటన్ మష్రుమ్ ను అందులో వేసి మూత పెట్టి 10 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
8. తర్వాత మూత తీసి, సరిపడా నీళ్ళు పోసి,తక్కువ మంట మీద గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
9. చివరగా గరం మసాలా వేసి మిక్స్ చేసి స్టై ఆఫ్ చేయాలి. అంతే కాజు మష్రుమ్ మసాల రెడీ. ఈ కర్రీని ప్లెయిన్ రైస్ లేదా పరోటాలకు సైడ్ డిష్ గా సర్వ్ చేయండి.

English summary

Kaju Mushroom Masala For Rakshabandhan

Rakshabandhan is just round the corner and we are sure you are gearing up for the celebrations. Like all other Indian festivals, Rakshabandhan is also incomplete without the mention of good food. When it comes to treating your brother with the delicacies, you tend to get a little choosy since boys are not fond of all kinds of food and especially vegetables.
Desktop Bottom Promotion