For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాశ్మిర్ స్పెషల్ -దమ్ క్యాప్సికమ్

|

దమ్ రిసిపిలు మన ఇండియన్ కల్చర్ లో చాలా ఫేమస్. ఉదాహరణకు దమ్ బిర్యానీ, ఆలూ దమ్, దమ్ చికెన్ వంటివి చాలా ఫేమస్. దమ్ ఆలూ నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో కూడా చాలా ఫేమస్.

కొంచెం వెరైటీగా వెజిటేరియన్ దమ్..క్యాప్సికమ్ దమ్ కొన్ని మసాల దినుసులను ఉపయోగించి చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. వెరైటీగా కూడా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సులభం. మరికెందుకు ఆలస్యం రండి దమ్ ఆలూ ఎలా తయారు చేయాలో చూసేద్దాం...

Kashmiri Special Dum Capsicum

కావల్సిన పదార్థాలు:
క్యాప్సికమ్ : 1/2kg
నూనె : వేగించడానికి సరిపడా
స్టఫింగ్ కోసం :
తురిమిన పనీర్: 300grms
జీడిపప్పు: 100grms
కిస్ మిస్ : 50grms
యాలాకుల పొడి: 1tsp
కొత్తిమీర: 1tbsp
పచ్చిమిర్చి: 50grms
ఉప్పు: రుచికి తగినంత
గ్రేవీకోసం:
కాశ్మిరీ మిర్చి పౌడర్: 1tbsp
ఇంగువ: చిటికెడు
యాలకుల పొడి: 1tsp
పెరుగు: 1/2
మెంతి పొడి: చిటికెడు
శొంఠి పొడి: చిటికెడు
నెయ్యి : 2tbsp
ఉప్పు రుచికి తగినంత

తయారు చేయు విదానం :

1. ముందుగా క్యాప్సికమ్ కు గాట్లు పెట్టి గింజలను తీసి నూనెలో వేసి సన్నమంట మీద డీప్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టఫింగ్ కోసం తీసుకొన్న వాటిని కలిపి క్యాప్సికమ్ లో కూరలి.
3. తర్వాత మరో పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఇంగువ, పెరుగు వేసి కలిపి స్టఫ్ చేసిన క్యాప్సికమ్ తో పాటు గ్రేవీకి తీసుకున్న పదార్థాలన్నింటినీ వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి.
4. తర్వాత దీనికి పావు లీటరు నీటిని కలిపి మరో ఐదు నిముషాల పాటు ఉడికించాలి. మంట తగ్గించి మరోరెండు నిముషాల పాటు ఉండికించాలి.
5. చివరగా మెంతి పొడి, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. అంతే దమ్ క్యాప్సికమ్ రెడీ...

English summary

Kashmiri Special Dum Capsicum | కాశ్మిర్ స్పెషల్ -దమ్ క్యాప్సికమ్

The generously spiced gravy combines with the vegetables and low fat paneer to provide a double dose of flavour, fibre and vitamin A. Serve hot with Kashmiri Rotis.Capsicum is one of my favorite veggie. It tastes just so delicious with any ingredients.
Desktop Bottom Promotion