For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లో ఫ్యాట్ పన్నీర్ వెజిటేబుల్ సలాడ్-హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

సలాడ్ ఆరోగ్యకరమైన డిష్. ప్రస్తుత కాలంలో సలాడ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఏ రెస్టారెంట్లో చూసిన సలాడ్స్ ప్రత్యేకంగా తయారు చేయబడి కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. అంతే కాదు చాలా మంది డైటేరియన్లు కూడా వారి బరువు తగ్గించుకోవడానికి సలాడ్ డైయట్ ను పాటిస్తూ శరీరానికి కావల్సిన విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ను పొందుతుంటారు. ఎవరైతే డైయట్ చేస్తుంటారో వారందరూ ఈ సలాడ్స్ లను వారి రోజు వారి ఆహారంలో చేర్చుకోవచ్చు.

సలాడ్స్ లో క్యాలరీస్ మరియు లో ఫ్యాట్(కరెక్ట్ పద్దతిలో తయారు చేస్తే) కలిగి ఉంటాయి. ప్రతి రోజూ ఒక్కో రకంగా తయారు చేసుకోవడాని వివిధ రకాల సలాడ్స్ ఉన్నాయి. శాకాహారులు వెజిటేరియన్ సలాడ్స్ ను, ఫ్రూట్ సలాడ్స్ ను మాంసాహారుల వెజిటేరియన్ సలాడ్స్ తో పాటు మాంసాహరంను సలాడ్ లలో మిక్స్ చేసుకొని తింటుంటారు. కాబట్టి ఇక్కడ వెజిటేరియన్ సలాడ్ మీకోసం.. ఎలా తయారు చేయాలో చూడండి.

కావల్సిన పదార్థాలు:
పన్నీర్: 1cup(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కీరదోసకాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఆవాలు: ½ tsp
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 1tsp(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

Low Fat Paneer Vegetable Salad

తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, అందులో పన్నీర్ ముక్కలు వేసి, మీడియం మంట మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ లో మారగానే స్టౌ ఆఫ్ చేసేయాలి.
3. ఇప్పుడు ఒక బౌల్ ల్లో వెజిటేబుల్స్ (ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కీరదోసకాయ మరియు టమోటో ముక్కలను అన్నింటినీ)వేసి బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత అందులోనే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. అందులో ఉప్పు, ఆవాల పొడి వేసి మరికొంత సేపు బాగా మిక్స్ చేయాలి.
5. చివరగా నిమ్మరసం పిండి మరో సారి కలిపి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే లో ఫ్యాట్ పన్నీర్ వెజిటేబుల్ సలాడ్ రెడీ...

English summary

Low Fat Paneer Vegetable Salad | లో ఫ్యాట్ పన్నీర్ వెజిటేబుల్ సలాడ్

Salad is one of the healthiest dishes. Celebrities have brought the trend of including salads in your meal. There are many dieters who follow a salad diet to lose weight while taking in the required vitamins and nutrients to stay healthy.
Story first published: Friday, January 25, 2013, 11:19 [IST]
Desktop Bottom Promotion