For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబార్ స్టైల్ స్పినాచ్ దాల్ రిసిపి

|

ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడేవారికి ఆకుకూర ఒక అద్భుతమైన ఆహారం. ఈ అద్భుతమైన ఆకుకూరల్లో ఐరన్, విటమిన్స్, ఫైబర్, క్యాల్షియం, మరియు యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసే మరిన్ని ఫ్లెవనాయిడ్స్ తో పుష్కలంగా నిండి ఉంది. ఇవన్నీ కాకుండా, ఆకుకూరలతో తయారుచేసే వంటలు రుచికరంగా ఉంటాయి. వెజిటేరియన్స్ కు చాలా ఇష్టమైన రుచి.

మలబార్ స్పినాచ్ దాల్ రిసిపి హైప్రోటీన్ మరియు ఐరన్ రిచ్ రిసిపి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ కాంబినేషన్ దాల్, జ్యూసీ స్పినాచ్ ఈ వంట చాలా సింపుల్ గా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది . అలాగే తాజా కరివేపాకు ఆకులు నోరూరించే రుచిక కలిగి ఉంటుంది. దీన్ని చాలా తర్వాగా సులభంగా తయారుచేవచ్చు. మరి ఈ మలబార్ స్టైల్ స్పినాచ్ దాల్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Malabar Spinach Dal Recipe

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1cup
బచ్చలికూర ఆకులు: 2cups(తరిగినవి)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3 (మద్యలోకి తరిగినవి)
అల్లం: ½tsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
చింతపండు గుజ్జు: 1tbsp
నీళ్ళు: 2cups
పోపుకోసం:
ఆవాలు: ½tsp
జీలకర్ర: 1tsp
మినపప్పు: 1tsp
వెల్లుల్లి 3-4 (దంచుకోవాలి)
ఎండు మిర్చి: 2 (మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
కరివేపాకు: 10-12
ఆయిల్: 2tbsp
తయారుచేయు విధానం :
1. ముందుగా ఆకుకూరలను విడిపించి, శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో కందిపప్పు, ఆకుకూర, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు మరియు నీళ్ళే పోయాలి.
3. ప్రెజర్ కుక్కర్ కు మూత పెట్టి, మీడియం మంట మీద, మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
4. ఒకసారి ఉడికించుకొన్న తర్వాత, మంట మీద నుండి కుక్కర్ ను పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి.
5. తర్వాత డీప్ బాటమ్ పాప్ లో నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
6. తర్వాత అందులో కరివేపాకు, డ్రై రెడ్ చిల్లీ, ఉద్దిపప్పు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే రెండు నిముషాలు మీడియం మంట మీద 2నిముషాలు వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్న ఆకుకూరపప్పు అలాగే వేయవచ్చు లేదా పాపుకొని వేసి బాగా మిక్స్ చేయాలి.
8. అలాగే అందులో చింతపండు గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత 6-7నిముషాలు మీడియం మంట మీద ఉండనిచ్చి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే మలబార్ స్పినాచ్ దాల్ రిసిపి రెడీ. ఇది రైస్ మరియు రోటీలకు చాలా అద్భుతంగా ఉంటుంది.

Story first published: Thursday, December 26, 2013, 11:57 [IST]
Desktop Bottom Promotion