For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలై పన్నీర్ -చాలా సింపుల్ అండే టేస్టీ

|

మలై పన్నీర్ రిసిపి చాలా సులభం. చాలా సులభం అయితే టేస్ట్ మాత్రం అమోఘం. ఈ వంటకాన్ని ఏ టైమ్ లో చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, మీల్, డిన్నర్ అన్నింటికి బాగా నప్పుతుంది. సైడ్ డిష్ గా మరింత రుచిగా ఉంటుంది.

పన్నీర్ తో అనేక రకాల వంటలు వండుతారు. అయితే కొంచెం డిఫరెంట్ గా కొత్త రుచి కోరుకొనే వారు మలై పన్నీర్ రిసిపిని ట్రై చేయవచ్చు. ఇది పిల్లలకు.. పెద్దలకు అందరికీ, యంగ్ స్టర్స్ కు అందరికీ నచ్చుతుంది. మరి ఈ రోజు పన్నీర్ రిసిపి ట్రై చేయండి.....

Malai Paneer- Easy and Simple

కావలసిన పదార్థాలు
పన్నీర్‌ ముక్కలు: 1/2kg
ఉల్లిపాయలు: 2
టమోటో: 2
గరం మసాలా: 1tsp
అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 2tsp
కారం : 1tbsp
ధనియాల పొడి : 1tbsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
మీగడ: 1/2cup
నూనె: 1/4cup

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేయాలి. నూనె వేడయ్యాక తురిమిన ఉల్లిపాయల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.
2. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద కారం, ధనియాల పొడి, పసుపు, టమోటో ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలపాటు వేయించాలి.
3. తరువాత పన్నీర్‌ముక్కలు వేసి మసాలా వాటికి బాగా పట్టే వరకు వేగించాలి. చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
5. చివరగా గరం మసాలా వేడి కలియబెట్టి, మరో రెండు నిముషాల ఉడికంచి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి. అంతే మలైపన్నీర్ రెడీ. ఇది చపాతీలోకి, పలావ్‌లోకి చాలా బాగుంటుంది.

English summary

Malai Paneer- Easy and Simple | మలై పన్నీర్ -చాలా సింపుల్ అండే టేస్టీ


 This is a very simple yet tasty recipe. Best part is that it hardly takes any time to prepare this dish and is loved by all....be it kids, elders or youngsters..
Story first published: Friday, April 5, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion