For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మామిడి పండు-పెరుగు అన్నం బ్యూటీఫుల్ కాంబినేషన్

|

పెరుగు అన్నం చాలా మంది ఫేవరెట్ డిష్. ముఖ్యంగా సౌంత్ ఇండియన్ వారికి చాలా ఇష్టం. వేడి వాతావరంలో లేదా వేసవి కాలంలో పెరుగు లేదా పెరుగుతో అన్నం తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైనది. ఆరోగ్యకరం మాత్రమే కాదు. వేసవి కాలంలో ఈ రిసిపి చాలా మందికి సంతృప్తికరమైన భోజనం. అతి తేలికగా జీర్ణం అయ్యే ఆహారం ఇది. అంతే కాదు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు హెవీ మీల్స్ తినడానికి ఇష్టం లేనప్పడు కర్డ్ రైస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

కర్డ్ రిసిపిలో చాలా రకాలున్నాయి. లెఫ్ ఓవర్ రైస్, పెరుగుతో వివిధ వెరైటీలను తయారు చేసుకోవచ్చు. వాటినికి మరింత టేస్ట్ యాడ్ చేయాలంటే ఈ సీజన్ లో మామిడి పండు అద్భుతమైన కాంబినేషన్. కాంబినేషన్ మాత్రమే కాదు టేస్టీ అండ్ హెల్తీ కూడా. మరి ఈ మ్యాంగో కర్డ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Mango Curd Rice Recipe

కావల్సిన పదార్థాలు:
వండిన అన్నం: 2 cups
పెరుగు: 1 cup
బాగా పండిన మామిడి పండు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లం: చిన్న ముక్క(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి లేదా తురుముకోవాలి)
ఆవాలు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, కరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడించాలి.
2. తర్వాత అందులో అల్లం తురుము, కరివేపాకు వేసి రెండు నిముషాలు వేగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసి స్పూన్ తో బాగా షేక్ చేయాలి.
4. తర్వాత వేగించి పెట్టుకొన్న పాన్ లోని మిశ్రమం చల్లారిన తర్వాత అందులో షేక్ చేసి పెట్టుకొన్న పెరుగు వేసి మిక్స్ చేయాలి.
5. తర్వాత అందులోనే మామిడి ముక్కలు వేసి, బాగా మిక్స్ చేయాలి. మామిడి ముక్కలు పెరుగులో బాగా కలిసి వేదింగా స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ ల్లో అన్నం తీసుకొని, దాని మీద మామిడి, పెరుగు మిశ్రమాన్ని పోయాలి. అన్నంతో పాటా బాగా మిక్స్ చేసి ఫ్రిజ్ లో పెట్టాలి.
7. అరగంట తర్వాత ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి, చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో కర్డ్ రైస్ రెడీ.

English summary

Mango Curd Rice Recipe

Curd rice is a favourite dish for many of us. It is especially close to the heart of the people from South India. Curd rice or rice with yogurt is one of the most satisfying meals during a humid day.
Story first published: Tuesday, June 25, 2013, 11:59 [IST]
Desktop Bottom Promotion