For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ మ్యాంగో రసం: సమ్మర్ స్పెషల్

|

సాధారణంగా ఒకే రకమైన వంటలు తిని బోరుకొడుతుంటే, కాత వంటలు తయారుచేసే పద్దతులు మార్చండి. సాధారణంగా రసంను వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. చింతపండు రసం, టమోటో రసం, నిమ్మరసం, ఇలా ఒక్కోరకంగా తయారుచేస్తారు. అయితే ఈ సమ్మర్ సీజన్ లో మనకు పచ్చిమామిడికాయలు అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించి కాస్త పుల్లగా, కాస్త తియ్యగా మామిడికాయ రసం చాలా రుచిగా ఉంటుంది.

పచ్చిమామిడికాయతో తయారుచేసే వంటల రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి వాటిలో రసం కూడా ఒకటి. మరి మీరు కూడా ఒక వెరైటీ టేస్ట్ ను రుచి చూడలంటే, మ్యాంగో రసం ట్రై చేయాల్సిందే...

Mango Rasam :Summer Special

కావల్సిన పదార్థాలు:
పచ్చిమామిడికాయ: 1(పొట్టుతీసి, ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి)
బెల్లం: చిన్న ముక్క
పెప్పర్(బ్లాక్ మిరియాలు): 3tsp
జీలకర్ర: 3tsp
కరివేపాకు : 2, 3 రెమ్మలు
పచ్చిమిర్చి: 2-3(మద్యలోకి కట్ చేసుకోవాలి)
కొబ్బరి తురుము: 1cup
ఆవాలు: 1tsp
ఎండు మిర్చి: 1
నీళ్ళు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఉడికించిన మామిడి కాయ ముక్కల నీరును వేరే గిన్నెలోకి వంపుకోవాలి. ఆ మామిడికాయ నీళ్ళకు, మరికొన్ని నీళ్ళు జోడించి, ఉడికించుకోవాలి.
2. తర్వాత, బ్లాక్ పెప్పర్, మరియు జీలకర్ర, మరియు ఎండు మిర్చి ఫ్రైయింగ్ పాన్ లో వేసి, లైట్ గా ఫ్రై చేసుకొని, జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
3. తర్వాత కొద్దిగా నూనె, ఫ్రైడ్ చిల్లీ మరియు కొబ్బరి తురుము కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ముందుగా పౌడర్ చేసుకన్న దానికి ఈ కొబ్బరి పేస్ట్ ను జోడించి, అందులో కొద్దిగా ఉప్పు, బెల్లం వేసి మొత్తం మిక్స్ చేసి మామిడికాయ రసంలో వేసి బాగా మిక్స్ చేయాలి.
5. చివరగా పాన్ లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత ఆవాలు, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసిన తర్వాత రసాన్నిపోపు పెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి క్రిందికి దింపుకోవాలి.
అంతే మ్యాంగో రసం రెడీ. వేడి వేడి అన్నంతో సర్వ్ చేయవచ్చు.

English summary

Mango Rasam :Summer Special

And if you are bored of preparing the usual tomato rasams, here is a spicy mango rasam recipe that can be prepared for your evening supper and tastes best with rice and ghee. All that you require is a raw mango that can make a big difference in taste and helps you have a light meal at night. Take a look to know how to go about with aam rasam or mango rasam recipe.
Story first published: Wednesday, April 16, 2014, 18:11 [IST]
Desktop Bottom Promotion