For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి మామిడికాయ సాంబార్: సౌత్ ఇండియన్ స్పెషల్

|

సాంబార్ అంటే కొత్తగా చెప్పేదేముంది అంటారా?? పప్పుచారుకు, సాంబార్ కు గల తేడా ఏంటంటే... కందిపప్పు ఉడికించి, చింతపండు పులుసు, కూరగాయలు వగైరా వేసి మరిగిస్తాం. కాని సాంబార్ అంటే ప్రత్యేకంగా చేసుకున్న సాంబార్ పొడి వేయాలి. దీనివల్ల కొత్త రుచి వస్తుంది.

ఈ సీజన్ లో మామిడికాయ ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. వీటితో సాంబార్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ మామిడికాయ సాంబార్ సౌత్ ఇండియన్ స్పెషల్ . మామిడికాయతో వివిధ రకాల వంటలు వండుతారు. అలాగే సాంబార్ కూడా. పచ్చిమామిడికాయ సాంబార్ ఇతర సాంబార్ల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ సమ్మర్ స్పెషల్ టేస్టీ మ్యాంగో సాంబార్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mango Sambar:A popular South Indian sambar variety.

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1cup(ఉడికించాలి)
మామిడికాయ: 1 తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోావలి.
చింతపండు : కొద్దిగా
సాంబార్ మసాలా పౌడర్: 2tbsp
ధనియాలా పొడి : 1tbsp
కారం: 1tbsp
జీలకర్ర: 1tbsp
ఆవాలు: 1tbsp
ఎండుమిర్చి: 3
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
దోసకాయ, సొరకాయ ముక్కలు: 1/2cup(ఉడికించుకోవాలి)
టమోటో: 1
కొత్తిమీర తరుగు: 1tbsp
వెల్లుల్లి రెబ్బలు: 2-3
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కందిపప్పు, టమోటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
2. రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్ లో ఆవిరి తగ్గినతర్వతా పప్పు గుత్తితో మెత్తగా పేస్ట్ లా పామి పక్కన పెట్టుకోవాలి .
3. ఈ పప్పులోనే మిగిలన ఉల్లిపాయముక్కలు, టమాటో, వెల్లుల్లి ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పోపుగింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, దోస, సొరకాయ, టమోటో, మామిడికాయ ముక్కలు కూడా వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు గుజ్జును వేసి రెండు నిముషాలు మరిగించాలి .
5. రెండు నిముషాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న పప్పును ఈ పోపు మిశ్రమంలో వేసి సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి తక్కువ మంట మీద మరో 5-10నిముషాల పాటు ఉడికించుకోవాలి.
6. చివరగా కొత్తిమీర గార్నిష్ గా వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మామిడికాయ సాంబార్ రెడీ. వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Mango Sambar:A popular South Indian sambar variety.

Raw Mango Sambar(Maanga Sambar) is one of the most flavourful sambar recipes. Now we have mango season in India, so here is an easy mango sambar recipe for you. We can prepare a variety of dishes with mangoes like mango pachadi, mango rice, ice cream, mango panna etc.
Story first published: Thursday, March 27, 2014, 12:25 [IST]
Desktop Bottom Promotion