For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా బాత్: టేస్టీ మీల్ రిసిపి

|

మసాలా బాత్ ఒక రుచికరమైన ట్రెడిషనల్ రిసిపి, పండుగ వేళల్లో ఇంటువంటి స్పెషల్ మీల్ వంటలకు చాలా క్రేజ్, ఇంట్లో వారితో పాటు, ఇంటికి వచ్చే అథితులను కూడా సంతృప్తి పరచడానికి ఇటువంటి వంటలు చాలా బాగుంటాయి. అంతే కాదు, త్వరగా మరియు ఈజీగా తయారుచేసేయవచ్చు.

మసాలా బాత్ రిసిపికి మీకు నచ్చిన కూరగాయలను కోడా జోడిస్తే, రుచికి రుచి, ఆరోగ్యం కూడా. చాలా సింపుల్ గా త్వరగా తయారుచేసే ఈ మసాలా బాత్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Masala Bhaat: Tasty Meal Recipe

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
వంకాయలు: 2-3
దొండకాయ: 5-6(సన్నగా కట్ చేసుకోవాలి)
డ్రై కోకనట్: 1/2cup(కొబ్బరి తురుము)
డ్రై రెడ్ చిల్లీ: 2
ధనియాలు: 2tsp
పసుపు: 2tsp
లవంగాలు: 2
జీలకర్ర: 2tsp
యాలకులు: 2
బిర్యానీ ఆకు: 1
జీడిపప్పు: 7-8
వేరుశెనగలు: 2tbsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 3cups

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి అరటంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వంకాయ ముక్కలు మరియు దొండకాయ ముక్కలను 10నిముషాలు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిలో కొద్దిగా ఉప్పు వేయాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ధనియాలు, డ్రై కొబ్బరి మరియు జీలకర్ర అన్నింటిని 2 నిముషాలు వేగించుకోవాలి. తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు మరో వెడల్పాటి పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడయ్యక అందులో జీలకర్ర, లవంగాలు, యాలకులు మరియు బిర్యానీ ఆకు వేసి కొన్ని నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే కూరగాయ ముక్కలు, ధనియాలు, పసుపు, పళ్ళీలు మరియు ఉప్పు వేసి మరో 3-4నిముషాలు వేగించుకోవాలి.
6. మీడియం మంట మీద వేగిస్తూ ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే సరిపడా నీళ్ళు, బియ్యం వేసి పూర్తిగా ఉడికి నీరు మొత్తం ఇంకిపోయే వరకూ ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు పూర్తిగా మంట తగ్గించి మద్యమద్యలో వేగిస్తూ మొత్తం మిశ్రమాన్ని పూర్తిగా ఉడికించుకోవాలి. మసాలా బాత్ రెడీ అయిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి నట్స్, కొబ్బరి తురుము కొత్తిమీర తురుము వేసి గార్నిష్ చేయాలి. ఈ మసాలా బాత్ ను కొత్తిమీర చట్నీ లేదా కర్రీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Masala Bhaat: Tasty Meal Recipe

What about meals? You can't just serve sweets in a meal plate. Here is the traditional masala bhaat recipe that you can prepare in the typical Maharashtrian style to celebrate Ganesh Chaturthi.
Story first published: Saturday, August 30, 2014, 13:47 [IST]
Desktop Bottom Promotion