For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాల బ్రెడ్ టోస్ట్-హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

బ్రెడ్ టోస్ట్. ఇది బ్రేక్ ఫాస్ట్ రిసిపి . ఉదయం అల్పాహారం బ్రెడ్ టోస్ట్ తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా ఉదయం తీసుకొనే అల్పాహారాల్లో చాలా రకాలున్నయి. బ్రెడ్ , ఓట్స్, కార్న్ ఫ్లేక్స్, పరాఠాలు, రైస్, మరియు గుడ్డు వంటివి బేసిక్ ఫుడ్స్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

Masala Bread Toast: Breakfast Recipe

ప్రపంచ వ్యాప్తంగా అల్పాహారాల్లో బ్రెడ్ చాలా ప్రాధాన్యత కలిగిన బ్రేక్ ఫాస్ట్ రిసిపి . దీన్ని తయారు చేయడం సులభం. బ్రెడ్ టోస్ట్ ను బట్టర్, జామ్ లేదా తేనె వంటివి రాసి ఒక గ్లాస్ కాఫీ లేదా జ్యూస్ వంటి కాంబినేషల్లో చాలా మంది తమ బ్రేక్ ఫాస్ట్ ముగించేస్తారు. అయితే ఒకే రకమైన బ్రెడ్ టోస్ట్ ను ప్రతి రోజూ తినలేరు కాబట్టి, స్ర్కాబుల్డ్ ఎగ్ అనేది ఒక రుచి అల్పాహారం. మరి మరో వెరైటీ మసాలా బ్రెడ్ టోస్ట్ ను ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది ?మసాలా బ్రెడ్ టోస్ట్ టేస్ట్ మాత్రమే కాదు, కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీన్ని కొన్ని వెజిటేబుల్స్, మరియు గుడ్డు, మసాలాలతో తయారుచేస్తారు . ఎలా తయారు చేయాలా చూడండి.

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ స్లైస్: 6-8
ఉల్లిపాయ: 1 (sliced)
టమోటో: ½ (sliced)
పచ్చిమిర్చి: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
గుడ్లు: 3
బ్లాక్ పెప్పర్: 1tsp
కారం: ½ tsp
జీలకర్ర పొడి: 1tsp
టమోటో సాస్: 2tbsp
బట్టర్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్డును పగులగొట్టి లోపలి మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి తీసి ,స్పూన్ తో బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక చెంచా నూనె తీసుకొని ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు సగం, టమోటోముక్కలు మరియు పచ్చిమిర్చి వేసి, వేగించాలి.
3. ఉల్లిపాయ ముక్కలు వేగి కొంచెం మెత్తబడ్డాక, అందులో పక్కన పెట్టుకొన్ని గుడ్డును అందులో పోయాలి. మీడియం మంట మీదా బాగా వేగించాలి. ఉల్లిపాయ, టమోటో పచ్చిమిర్చితో బాగా మిక్స్ చేస్తూ,తగినంత ఉప్పు వేసి వేగించిన తర్వాత దాన్ని ఫ్రైయింగ్ పాన్ లోనే బాగా పొడిపొడిగా చేసుకోవాలి .
4. పొడిగా వేగించేటప్పుడు కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడిని చిలకరించాలి. అలాగే టమోటో కెచప్ లేదా సాస్ కూడా వేసి మరో రెండు నిముషాలు తక్కువ మంట మీద వేగించాలి.
5. టోస్ట్ కోసం బ్రెడ్ స్లైస్ తీసుకొని వాటి మీద బట్టర్ రాయాలి. తర్వాత దాని మీద ఫ్రైచేసుకొన్న మసాలా బ్రెడ్ టోస్ట్ ను వేసి బ్రెడ్ మొత్తం సర్ధాలి. వాటి మీద ముందుగా మిగిలించుకొన్ని ఉల్లిపాయ, టమోటో మరియు పచ్చిమిర్చి ముక్కలను కొద్దిగా వేసుకోవాలి. అంతే మసాలా బ్రెడ్ టోస్ట్ రెడీ. దీన్ని ఒక గ్లాస్ పండ్ల రసంతో సర్వ్ చేయాలి అంతే.

English summary

Masala Bread Toast: Breakfast Recipe | మసాల బ్రెడ్ టోస్ట్-బ్రేక్ ఫాస్ట్ రిసిపి

Breakfast is one of the most important meal of the day and one should avoid skipping this meal. There are many breakfast recipes that you can try early morning. Bread, oats, corn flakes, paranthas, rice and eggs form the basic food items for breakfast. Bread is one of the most popular breakfast recipes worldwide. They are easy to prepare and filling too.
Story first published: Thursday, March 28, 2013, 11:14 [IST]
Desktop Bottom Promotion