For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా మిర్చి: సైడ్ డిష్ రిసిపి

|

బారవా మిర్చి ఒక అద్భుతమైన రుచికరమైన మిర్చి డిష్ మరియు ఇది ఒక స్పైసీ డిష్ . ఈ డిష్ ను ఇండియన్ కుషన్స్ తో సర్వ్ చేస్తారు. స్టఫ్ చేసిన పచ్చిమిర్చి చాలా రుచికరంగా మరియు టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ లేదా రోటీలకు చాలా అద్భుతమైన కాంబినేషన్.

బారవా మిర్చి ఒక స్టఫ్డ్ మిర్చి లా బాగా ప్రసిద్ధి. ఈ స్టఫింగ్ బారవా మిర్చి ఇది చాలా టేస్ట్ గా మరియు ఇష్టంగా ఉంటుంది. మీరు దీనికి శెనగపిండి లేదా సాధారణ మసాలా దినుసులను ఉపయోగించి, స్టఫింగ్ చేసి తయారుచేయవచ్చు. మిర్చిని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . మరి మీ మీల్స్ ను స్పైసీగా మరియు అద్భుత రుచికరంగా తయారుచేసుకోండి.

ఇక్కడ అటువంటి సింపుల్ మసాలా రిసిపి మీకోసం ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా లసులభం మరియు అలాగే మరీ అంత కారంగా కూడా ఉండదు. దీన్ని తయారు చేయడానికి పదినిముషాలు సమయం పడుతుంది. మీరు ఒక సారి ట్రై చేయండి.

Masala Mirchi: Side Dish Recipe

కావల్సిన పదార్థాలు:
పొడవాటి పచ్చిమిర్చి : 5-6
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి :1tsp
చిన్న పచ్చిమిర్చి : 2
ఆమ్చూర్ పొడి: 1tsp
ఆవాలు : ½tsp
ఉప్పు: రుచికిసరిపడా
నిమ్మరసం: 1tsp
నూనె: 2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పొడవాటి పచ్చిమిర్చి మరియు చిన్న పచ్చిమిర్చిను మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోండి. ఇంకా మీకు అవసరం అయితే వాటిని మద్యకు కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడాకా అందులో కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చిని కూడా వేయండి.
3. మీడియం మంట పెట్టి వేగించాలి. వేగించేటప్పుడే అందులో ఉప్పు మరియు పుసు కూడా వేయాలి.
4. ఇవి వేసిన తర్వాత మరో 5నిముషాలు పచ్చిమిర్చి మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
5. పచ్చిమిర్చి మెత్తగా వేగిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, ఆమ్చూర్(మామిడి పొడి) వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించడం వల్ల మిర్చికీ మసాలాలన్ని బాగా పడుతాయి.
7. ఇప్పుడు మిర్చీ పూర్తిగాఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే మిర్చి మసాలా రెడీ. ఈ మిర్చి మాసాలాను రోటీ లేదా రైస్ తో పాటు తినవచ్చు.

English summary

Masala Mirchi: Side Dish Recipe

Bharwa mirchi is one of the delicious and spicy side dishes which is served in the Indian cuisine. The stuffed green chillies taste yum and can be teamed up with rice or roti.
Story first published: Friday, November 29, 2013, 16:43 [IST]
Desktop Bottom Promotion