For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసూర్ దాల్(పప్పు)రసం: ఆంధ్ర స్పెషల్

|

రసంలేదా చారు అనేది ఒక దక్షిణ భారత సూపు (ద్రవపదార్థ వంటకం). సాంప్రదాయ తయారీ విధానంతో తయారయ్యే ఈ వంటకంలో ప్రధానంగా చింతపండు రసం ఉపయోగించడంతో పాటు అదనంగా టమోటో, నిమ్మకాయ, మిరప మరియు ఇతర రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఏదేని కూరగాయలు జోడించడంతో పాటు ఉడకబెట్టిన పప్పులును కూడా కొంచెం ఈ రసానికి కలుపుతారు. ప్రస్తుత రోజుల్లో రసం తయారీకి అవసరమైన మసాలా దినుసులన్నింటినీ ఒక్కటిగా జోడించి ముందుస్తుగానే పొడిచేసి అప్పటికప్పుడు ఉపయోగించడానికి వీలుగా రసం పొడి పేరుతో అందుబాటులో ఉంచుతున్నారు.

వీటిని అన్నంతో కలిపి లేదా సూపు రూపంలో తీసుకునేందుకు వీలుగా ఉంటాయి. సంప్రదాయ భోజనంలో ఇది సాంబారు అన్నం తర్వాతి స్థానాన్ని వహించడంతో పాటు దీనితర్వాత పెరుగు అన్నం తీసుకోవడం జరుగుతుంది. రసం అనేది తనకంటూ ప్రత్యేకమైన మసాల దినుసులను కలిగి ఉండడంతో పాటు పూర్తిగా పల్చటి ద్రవ రూపంలో ఉండడం వల్ల సాంబారుతో పోలిస్తే రసం అనేది ఒక విశిష్టమైన రుచిని కలిగి ఉంటుంది.

Masoor Dal(Pappu) Rasam

కావలసిన పదార్థాలు :
మసూర్ దాల్(ఎర్ర కందిపప్పు) : 1cup
చింతపండు : కొద్దిగా
నిమ్మకాయ : ఒకటి
పచ్చిమిర్చి : 8
జీలకర్ర : 1tsp
మెంతిపొడి : 1/4tsp
పసుపు : చిటికెడు
ఇంగువ : కొద్దిగా
పూదీన ఆకులు: పది
కొత్తిమీర తరుగు: 1/2cup
వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది
ఉల్లిపాయ : 1
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా చింతపండులో ఆరు కప్పుల నీళ్ళు పోసి గంటసేపు నాననివ్వాలి. అంతలోపు స్టౌ మీద పచ్చిమిర్చిని కాల్చి చింతపండు నీళ్ళలో వేసి రెండింటిని బాగా చేత్తో కలిపి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మసూర్ దాల్ ఎర్రకందిపప్పు కడిగి కప్పున్నర నీళ్లు పోసి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
4. తర్వాత అందులోనే పూదీనా ఆకులు, మసూర్ దాల్ వేసి కలపాలి.
5. ఒక నిమిషం తర్వాత పసుపు, చింతపండు రసం, మెంతిపొడి, ఉప్పు వేయాలి.
6. ఐదు నిమిషాల తర్వాత నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి మరో నిమిషం మరిగించాలి. ఈ రసం మెత్తగా ఉడికించిన అన్నంలోకి చాలా రుచికరంగా బాగుంటుంది.

English summary

Masoor Dal(Pappu) Rasam

A classic south Indian dish, basically a tamarind lentil stew cooked with various types of vegetables. Pappu charu is redolent with the delicate flavor of curry leaves and seasoned with Indian spices like cumin, mustard, and fenugreek and ginger garlic paste. Cooking a simple Andhra meal is not rocket science. If you are too tired to cook an elaborate spread on any working day, then pappu charu and steamed rice can be a simple and delectable idea.
Story first published: Wednesday, September 10, 2014, 12:28 [IST]
Desktop Bottom Promotion