For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మట్టర్ పన్నీర్ డ్రై స్పెషల్ సైడ్ డిష్

|

పన్నీరును మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ తో తయారు చేసే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. పన్నీర్ తో తయారు చేసే వంటలు, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వివిధ వెరైటీలను సర్వ చేస్తారు. పన్నీర్ తో కర్రీలు, వేపుళ్ళు, సలాడ్స్, సాండ్విచ్ లు మాత్రమే కాకుండా స్నాక్స్ కూడా తయారు చేస్తారు.

ఇక పచ్చిబఠానీతో తయారు చేసే వంటలు చాలా పాపులర్ వంటకాలు. పచ్చిబఠానీలు, పన్నీర్ కాంబినేషన్, గ్రేవీ మసాలా చాలా టేస్ట్ గా ఉంటుంది. అందులో క్రిస్పీగా వేయించిన పన్నీర్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడ పన్నీర్ తో కొత్త వంటను రుచి చూడాలనుకుంటే ఈ వంటను ట్రై చేయండి.

Matar Paneer Dry: Side Dish Recipe
పన్నీర్ ముక్కలు: 1cup
పచ్చిబఠానీ: 1cup
ఉల్లిపాయ: 2(chopped)optional
టమోటో: 1(chopped)
పాలు: ½cup
అల్లం: 1inch(minced)
వెల్లుల్లి రెబ్బలు: 5-6(chopped)
పసుపు: చిటికెడు
కారం: 1tsp
గరం: ½tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర: ½ tsp
బిర్యాని ఆకు: 1
ఉప్పు: as per taste
నీళ్ళు: ½ cup
నూనె: ½ cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ లో మూడు చెంచాల నూనె వేసి, వేడిఅయ్యాక అందులో బిర్యాని ఆకు వేసి, (అవసరం అయితే ఉల్లిపాయ ముక్కలను చేర్చుకోవచ్చు). అల్లం, వెల్లుల్లి వేసి మీడియం మంట మీద వేయించాలి.

2. తర్వాత పచ్చి బఠానీలకు వేసి మరో ఐదు -పది నిముషాల పాటు వేయించాలి.

3. పచ్చి బఠానీలు ఎప్పుడైతే వేగినట్టు అనిపిస్తాయో, ఆ సమయంలో తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలు, పసుపు పొడి, పన్నీర్ ముక్కలు, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి వేయించాలి. పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి అవసరం అయితే కొద్దిగా నూనె వేసుకోవచ్చు .

4. తర్వాత పన్నీర్ ముక్కలు వేగిన తర్వాత వాటి మీద కారం, జీలకర్ర పొడి చల్లి, కొద్దిగా పాలు, మరియు నీళ్ళు కలుపుకోవాలి . బాగా మిక్స్ చేసి మరో ఐదు నిముషాల పాటు గ్రేవీ చిక్కబడే వరకూ వేయించుకోవాలి.

5. చివరగా గరం మసాలా వేసి మిక్స్ చేసి వేగించిన తర్వాత పన్నీర్ ముక్కలు బ్రౌన్ కర్ లోనికి మారని గ్రేవీ చిక్కబడినట్లు తెలిస్తే, స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే తినడానికి మట్టర్ పన్నీర్ వేపుడు రెడీ.

English summary

Matar Paneer Dry: Side Dish Recipe | మట్టర్ పన్నీర్ ఫ్రై స్పెషల్ టేస్ట్


 Paneer is the desi cottage cheese that is prepared at home too! In Indian cuisine, there are many paneer recipes. From snacks to main course, you can find many recipes with this exotic ingredient. From all, matar paneer is one of the most popular main course recipe. Matar paneer is a gravy masala that is prepared with fried paneer cubes, matar (green peas) and lots of spices. However, if you want to try a different variety of the delicious and filling paneer matar, you can make the dry version.
Story first published: Monday, January 28, 2013, 15:13 [IST]
Desktop Bottom Promotion