For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీల్ మేకర్ బిర్యాని రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ

|

వీకెండ్స్ అయినా... వీక్ స్టార్ట్ అయినా...డే అయినా, నైట్ అయినా...బ్రేక్ ఫాస్ట్ అయినా, ఈవెనింగ్ స్నాక్స్ అయినా...వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా...
గెస్ట్‌లొచ్చినా, గెట్ టు గెదర్ అయినా...మీల్ మేకర్ ఉంటే నో ఫికర్!

మీల్ మేకర్ ను సోయా చుంక్స్ అని కూడా పిలుస్తాము. మీల్ మేకర్ లో ప్రోటీనలు అధికంగా ఉండే ఒక ఆహార పదార్థం. దీంతో బిర్యాని చాలా సులభంగా తయారుచేసుకోచ్చు . మీల్ మేకర్ బిర్యానీ రిసిపిని సైడ్ డిష్ లేకుండానే సర్వ్ చేయవచ్చు. అంతటి రుచి కలిగి ఉంటి. మీల్ మేకర్ బిర్యానీ రిసిపికి రైతా చక్కటి కాంబినేషన్. పుదీనా రైతా కూడా చాలా చక్కటి ఫ్లేవర్ మరియు టేస్ట్ ను అందిస్తుంది. ఈ బిర్యానీ రిసిపిని కుక్కర్ లో తయారుచేసుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం మీల్ మేకర్ బిర్యానీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి...

Meal Maker(Soya Chunks) Biryani

మీల్ మేకర్ అంటే నో ఫియర్!
మీల్ మేకర్ వండితే టేస్ట్ వండర్!
మీల్ మేకర్ పోషకాల లిస్ట్‌లో ఆల్‌రౌండర్!
బియ్యం : 1cup
నెయ్యి : 2tsp
లవంగాలు,చెక్క,యాలుకలు,బిర్యనిఆకు :రెండు రెండు చొప్పున తీసుకోవాలి.
మీల్ మేకర్ : 1/2cup
ఉప్పు : తగినంత
పుదినా : ఒక కట్ట
కొత్తిమీర : ఒక కట్ట
బిర్యానీ మసాలా : 1tsp
ఉల్లి ,పచ్చిమిర్చి ముక్కలు : 1/2cup

తయారుచేయు విధానం :
1. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. మీల్ మేకర్ వేడినీళ్ళల్లోవేసి ఒక నిముషం ఉంచి నీళ్ళు పిండి పక్కనపెట్టాలి.
3. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
4. నెయ్యి వేడి అయ్యిన తరువాత చెక్క, లవంగాలు, యలుకులు, బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి.
5. అవి వేగాక పుదినా, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
6. తరువాత పక్కన పెట్టిన మిల్ మేకర్ వేసి కాసేపు వేయించి కడిగి నానబెట్టిన బియ్యం వేసి ఒక సారి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి దానిలో ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి.
7. కాసేపటికి బిర్యానీ రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిలో కొత్తిమీర వేసి మూత పెట్టాలి. అంతే సర్వ్ చెయ్యటానికి మిల్ మేకర్ బిర్యానీ రెడి.

English summary

Meal Maker(Soya Chunks) Biryani

soya chunks biryani or meal maker biryani is one of the protein enriched easy biryani that one can make. It can be served without any side dish, however a simple onion raita or a mint raita also goes well with this.
Desktop Bottom Promotion