For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేతి మిస్సీ రోటి హెల్తీ అండ్ ఎనర్జిటిక్ బ్రేక్ ఫాస్ట్

|

సాధారణంగా ప్రతి రోజూ ఉదయం అల్పాహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో గ్రీన్ లీఫ్ తో బ్రేక్ ఫాస్ట్ అంటే మరింత ఆరోగ్యకరం. ప్రతి రోజూ మీరు తీసుకొనే డైట్ లో గ్రీన్ లీఫ్స్ చేర్చుకోవడం చాలా వసరం. ఆకుకూరల్లో మెంతి ఆకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇది వంటకు మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు, ఆస్తమా, బ్రొంకైటిస్ మరియు అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి తాజా మెంతి ఆకులను తీసుకొని ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసేసుకోండి.

పంజాబీయులకు మేతి రోటి చాలా పాపులర్ రిసిపి. దీన్ని గోధుమ పిండి మరియు శనగపిండి కాంబినేషన్ తో తయారు చేస్తారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పంజాబీ వంటకు మనం తాజా మెంతి ఆకులను చేర్చి న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ గా తయారు చేయడమే. కాబట్టి మీ బ్రేక్ ఫాస్ట్ మరింత ఆరోగ్యకరంగా కావాలంటే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఆకుకూరలను చేర్చుకోండి. మరి మేతి మెస్సీ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Methi Missi Roti For Healthy Breakfast
కావల్సిన పదార్థాలు:
తాజా మెంతి ఆకులు: 1cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
గోధుమ పిండి: 2cups
శెనగపిండి: 1cup
పచ్చిమిర్చి: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
కారం సీడ్స్: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు : 1/2కప్పు
నూనె లేదా నెయ్యి: 3tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, శెనగపిండి, ఉప్పు, మెంతి ఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం సీడ్స్, ఎండుమిర్చి పౌడర్ మరియు ఒక చెంచా నూనె వేసి, సరిపడా నీళ్ళు పోసి బాగా మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి.

2. ఈ పిండిని పది నిముషాలు పక్కన పెట్టుకొని తర్వాత కొద్ది..కొద్దిగా చేతిలోనికి తీసుకొని మీడియం సైజ్ బాల్స్ లా చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ బాల్స్ ను చపాతీ కర్రతో చపాతీల్లా రోల్ చేసుకోవాలి.
4. స్టౌ మీద తవా పెట్టి వేడిక్కెని తర్వాత నూనె లేదా నెయ్యి రాసి చపాతీలను ఒక్కోదాన్ని వేసి రెండు వైపులా బాగా కాలే వరకూ కాల్చుకోవాలి.
5. ఇలా అన్ని రోటీలు తయారు చేసుకొన్న తర్వాత వేడి వేడిగా కర్రీ లేదా పెరుగు లేదా పికెల్ తో సర్వ్ చేయాలి అంతే మేతి మిస్సీ రోటి రెడీ..

English summary

Methi Missi Roti For Healthy Breakfast

How about starting the day with a green and healthy breakfast? Adding the greens to your menu is always beneficial. Methi or fenugreek is one such wonder herb which not only adds flavour to your food but is also highly beneficial for asthma, bronchitis and indigestion. So, here is a nutritious breakfast recipe for you which is made with fresh fenugreek leaves.
Story first published: Wednesday, June 5, 2013, 11:30 [IST]
Desktop Bottom Promotion