For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెక్సికన్ ఎగ్ ఛీజ్ వ్రాప్: హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

దయం తీసుకొనే అల్పాహారం రుచికరంగాను అదే విధంగా హెల్తీగాను ఉండటం అనేది చాలా ముఖ్యం. యవ్వనంలో ఉన్నవారు ప్రతి రోజూ వారు తీసుకొనే భోజనంలో గుడ్డు తప్పనిసరిగా చేసుకోవాలి. గుడ్డులో ఆరోగ్యానికి ఉపయోగపడే అధిక ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హెల్తీ, న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం చాలా అవసరం.

మీరు బ్యాచులర్ ఐతే ఇటువంటి సింపుల్ బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. మీరు ఆరోగ్యంగా ఉండటానికి, ఎక్కువ శక్తిని అంధించడానికి కావల్సి పోషకాంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి, దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఎగ్ చీజ్ వ్రాప్ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. టోర్టిల్లా గోధులమతో తయారు చేసి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం. మరి మీరు దీన్ని తయారు చేసుకోవాలనుకుంటా. ఈ పద్దతిని ఫాలో అవ్వండి...

Mexican Egg Cheese Wrap

కావల్సిన పదార్థాలు:
ఫ్లౌర్ టోర్టిల్లా: 1 లేదా 2(8 అంగుళాల)
గుడ్డు: 1
మెక్సికన్ జున్ను: 2tbsp
సల్సా సాస్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. మొదట ఫ్లౌర్ టోర్టిల్లాను మైక్రోవోవెన్ సేఫ్ బౌల్లో నొక్కిపెట్టాలి.
2. ఇప్పడు ఫ్లౌర్ టోర్టిల్లా మద్యలో గుడ్డును పగులగొట్టి పోయాలి. గుడ్డు లిక్విడ్ ను ఫోర్క్ సహాయంతో బాగా గిలకొట్టాలి. (ముఖ్యంగా గుర్తించుకోవల్సింది, గుడ్డును గిలకొట్టేటప్పుడు టోర్టిల్లా చిరిగిపోకుండా జాగ్రత్తగా, చాలా నిదానంగా చేయాలి(లేదంటే గుడ్డును విడిగా ఒక చిన్న బౌల్లో వేసి బాగా గిలకొట్టి, తర్వాత ఫ్లౌర్ టోర్టిల్లాలో పోయవచ్చు)
3. ఇప్పుడు ఎగ్ లిక్విడ్ తో నింపిన టోర్టిలానో మైక్రోవోవెన్ లో పెట్టి, 45సెకండ్స్ కు సెట్ చేయాలి. 45సెకెండ్స్ తర్వాత గుడ్డు ఉడికిందో లేదో ఒక సారి చెక్ చేసుకోవాలి. ఒక వేళ గుడ్డు ఉడకనట్లైతే తిరిగి మైక్రోవోవెన్ లో పెట్టి, మరో 20నిముషాలు సెట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ఫ్లౌర్ టోర్టిల్లాన్ ను మైక్రోవోవెన్ బౌల్లో నుండి బయటకు తీసి, ఒక వెడల్పు ప్లేట్ లో పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఫ్లౌర్ టోర్టిల్లా మీద మెక్సికన్ చీజ్, సాల్సా సాస్ మరియు చిటికెడు ఉప్పును రాయాలి. తర్వాత ఫ్లౌర్ టోర్టిలాను క్రింది భాగం పూర్తిగా కవర్ చేయాలి. అలాగే సైడ్స్ ను లోపలికి మడిచి కవర్ చేయాలి . అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కొరకు ఎగ్ చీజ్ వ్రాప్ రెడీ..

English summary

Mexican Egg Cheese Wrap For Breakfast

When it comes to breakfast, having a healthy breakfast is very important. Youngsters should make it a habit to add an egg to their daily meals. Eggs contain high number of protein and are nutritious for health.
Story first published: Wednesday, July 24, 2013, 11:59 [IST]
Desktop Bottom Promotion