For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరంగా చిన్న కాకరకాయ ఫ్రై రిసిపి

కాకరకాయ అంటే ఇష్టపడని వారు చాలా మందే ఉంటారు. ఆ అయిష్టతకు కారణం చేదే కారణం, అయితే చేసే విధానంను బట్టి, చేదు తగ్గించుకోవచ్చు. కాకరకాయ వండేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చేదు ఉండదు. అందుకే ఈ రోజు మీక

By Lekhaka
|

కాకరకాయ అంటే ఇష్టపడని వారు చాలా మందే ఉంటారు. ఆ అయిష్టతకు కారణం చేదే కారణం, అయితే చేసే విధానంను బట్టి, చేదు తగ్గించుకోవచ్చు. కాకరకాయ వండేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చేదు ఉండదు. అందుకే ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ డిష్ ను పరిచయం చేస్తున్నారు.

అయితే పెద్దగా ఉండే కాకరకాయలకు బదులుగా చిన్న కాకరకాయను ఉపయోగించి చేయవచ్చు. తయారుచేయడం కూడా చాలా సులభం. మరియు టేస్ట్ గా కూడా ఉంటుంది

Mini Karela Recipe

నలుగురికి సర్వ్ చేయొచ్చు- 4

వండటానికి పట్టే సమయం - 15 minutes

ప్రిపేర్ చేసుకోవడానికి పట్టే సమయం - 10 minutes

కావల్సిన పదార్థాలు :

మిని బిట్టర్ గార్డ్ (చిన్న సైజు కాకరకాయలు) - 12 to 15

ఉల్లిపాయలు - 1 cup

పచ్చిమిర్చి - 4 to 5

అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ½ teaspoon

చింతపండు గుజ్జు - ½ cup

పసుపు - ¼th teaspoon

కారం - 1/2 teaspoon

గరం మసాలా - 1/2 teaspoon

మామిడిపొడి - 1/2 teaspoon

నూనె

తయారుచేయు విధానం:

కాకరకాయను శుభ్రంగా కడిగి, పైపై చెక్కుతీసి రెండు బాగాలు లేదా మీకు ఇష్టమొచ్చిన సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి.

లోపలి విత్తనాలను తొలగించాలి.

ఆలోపు కొన్ని నీళ్లను వేడి చేసి అందులో కాకరకాయ ముక్కలు వేయాలి. 15 నిముసాలు మీడియం మంట మీద బాయిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా ఉంటాయి.

తర్వాత క్రిందికి దింపుకుని, ఎక్సెస్ వాటర్ ను వంపేసుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం , వెల్లుల్లి పేస్ట వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.

తర్వాత మసాలా వేసి వేగించుకోవాలి . తర్వాత చింత పండు గుజ్జు వేసి ఉడికించాలి.

5 నిముషాల తర్వాత ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి , మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకుని, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. 15 నిముషాలు పూర్తిగా ఉడకనివ్వాలి

ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగును గార్నిష్ గా చిలకరించి పక్కన పెట్టుకోవాలి. అంతే మిని కాకరకాయ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ.

చిట్కా: కాకరకాయ చేదు ఉండకూదనుకుంటే, చిన్న కాకరకాయను రెండు ముక్కలుగా కట్ చేసి, వాటికి కొద్దిగా ఉప్పు పట్టించి, 1 నిముషాలు పక్కన పెట్టాలి. తర్వాత, నీటితోబాగా కడగాలి. అంతే చేదు తగ్గుతుంది.

స్టెప్ బై స్టెప్ ఫోటో గైడ్ : మిని కాకరకాయ రిసిపి , కాకరకాయ ఫ్రై రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 1

చిన్న సై్జ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 2

చిన్న సై్జ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 3

చిన్న సై్జ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 4
చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 5

చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 6

చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 7

చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 8

చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 9

చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

Mini Karela Recipe

స్టెప్ # 10

చిన్న సైజ్ కాకరకాయ సబ్జీ రిసిపి

English summary

Mini Karela Recipe | Stir Fry Bitter Gourd Recipe | Hagalkayi Palya

Some people may not like to have karela (bitter gourd) because of its bitter taste; however, by adding other ingredients, you could make a tasty recipe out of a karela.
Story first published:Monday, January 23, 2017, 17:14 [IST]
Desktop Bottom Promotion