For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ హెల్తీ పుదీనా పన్నీర్ పులావ్

|

సాధరంగా అన్నంతో వివిధ రకాల వెరైటీలను వివిధ రకాల ఫ్లేవర్స్ తో తాయరు చేసుకోవచ్చు . అందుకు సౌంత్ ఇండియన్ వంటకాలే మంచి ఉదాహరణ. అటువంటి వంటకాల్లో లెమన్ రైస్, టామరిండ్ రైస్, బ్రింజాల్ రైస్ వంటివి కూడా ఉన్నాయి. మీరు పుదీనా ఫ్లేవర్ తో రైస్ ఎప్పుడైనా రుచి చూశారా? లేదంటే ఇక్కడ మేము మీకందిస్తున్న మింట్ పుదీనా పులావ్ రిసిపిని ఒక సారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

మింట్ పనీర్ పులావ్ తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు చాలా సింపుల్ గా కలర్ ఫుల్ గా మంచి ఫ్లేవర్ తో టేస్టీ పులావ్ ను తయారు చేసేయవచ్చు. పుదీనా పులావ్ కు తాజా పుదీనా ఆకులు కావల్సి ఉంటుంది. మరి మింట్ ఫ్లేవర్ తో తయారు చేసే మింట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామా...

Mint Paneer Pulao

బాస్మతి రైస్: 2cups
పన్నీర్: 200grms(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా పుదీనా ఆకలు: 1కట్ట
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లిపాయలు: 4
చెక్క: చిన్న ముక్క
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు : 4cups

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రం చేసుకొని శుభ్రం కడిగా పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బియ్యంలో 4కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.
4. అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసి నీళ్ళు వేసి బాగా కడిగి పక్కనపెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా శుభ్రం చేసి మిక్సీలో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
5. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో చెక్క మరియు లవంగాలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
6. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే పుదీనా పేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
8. చివరగా ఉడికించి పెట్టుకొన్న అన్నం మరియు ఫ్రై చేసి పెట్టుకొన్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకొని స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే పుదీనా పన్నీర్ పులావ్ రెడీ. ఈ అద్భుతమైన వంటను రైతాతో సర్వ్ చేయాలి.

English summary

Mint Paneer Pulao: Easy Rice Recipe | టేస్టీ అండ్ హెల్తీ పుదీనా పన్నీర్ పులావ్

Adding flavour to rice is an easy way to add variety to your menu. The South-Indian rice recipes are the best examples of flavoured and delicious rice dishes. There are so many dishes such as the lemon rice, tamarind rice, brinjal rice etc.
Story first published: Tuesday, May 21, 2013, 12:17 [IST]
Desktop Bottom Promotion