For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిర్చి కా సాలన్: హైద్రాబాదీ గ్రీన్ చిల్లీ కర్రీ

|

మీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమా? అయితే మీకోసం ఒక ఫర్ ఫెక్ట్ ఇండియన్ కర్రీ ఉంది. మిర్చికా సాలర్ హైద్రాబాది స్పెషల్ వంటకం. ఇది చాలా ఫేమస్. మిర్చికా సాలన్ అంటే ఏమిటో మీకు తెలుసా?అదేనండీ గ్రీన్ చిల్లీ(పచ్చిమిర్చి)కర్రీ.

మిర్చికా సాలన్ వందశాతం వేజిటేరియన్ రిసిపినే అంతే కాదండోయ్..వందశాతం కారం కూడా.... కాబట్టి మీరు కారం తినాలని ఇష్టపడుతుంటే మిర్చికా సాలన్ టేస్ట్ చేయవచ్చు. దీనికి కోకోనట్ గ్రేవీ మంచి రుచిని అందిస్తుంది. మిర్చికా సాలన్ హైద్రాబాద్ వంటకాల్లో ఒక మార్క్ ఉంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా...

పచ్చిమిరపకాయలు: 400gram
మెంతులు: 1tsp
కరివేపాకు ఆకులు: 10
ఉల్లిపాయ: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పెరుగు: 1/2cup
పసుపు: 1 చిటికెడు
కారం: 1/2 tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
గసగసాలు: 1tsp
ఆవాలు: 1/2 tsp
నువ్వు గింజలు: 1/2tsp
కొబ్బరి: 1/2cup(తురిమినది)
చింతపండు రసం: 1/2cup
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

Mirch Ka Salan

తయారు చేయు విధానం:
1. డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో కొద్దిగా మెంతులు మరియు కరివేపాకు వేయాలి.
2. ఒక నిమిషం తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిముషాలు వేగించి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
3. తక్కువ మంటమీద ఐదు నిముషాల పాటు వేగించాలి. ఇప్పుడు అందులోనే పెరుగును కూడా వేసి వెంటనే పొడులన్నింటిని(కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి) ఒక దాని తర్వాత ఒకటి చిలకరించుకోవాలి.
4. వీటన్నింటిని మిక్స్ చేస్తూ మరో ఐదునిముషాల పాటు వేగించుకోవాలి.
5. అంతలోపు గసగసాలను, నువ్వులను మరియు ఆవాలను , కొబ్బరి తురుము వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. ఈ పేస్ట్ ఫ్రైయింగ్ పాన్ లో వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి (కట్ చేయకుండా అలాగే వేయాలి)వేసి ఒక కప్పు నీళ్ళు కూడా పోయాలి.
8. మూత పెట్టి మరో పది నిముషాల పాటు మీడియం మంట మీదు ఉడికించుకోవాలి. అంతే మిర్చీకా సాలన్ రెడీ. దీన్ని రైస్ లేదా రోటీలతో సర్వ్ చేయవచ్చు.

English summary

Mirch Ka Salan: Hyderabadi Green Chilli Curry | మిర్చి కా సాలన్: హైద్రాబాదీ గ్రీన్ చిల్లీ కర్రీ

Are you a freak for spicy food? Then we have the perfect Indian curry for you. Mirch ka salan is an authentic Hyderabadi recipe that is very popular. Do you know what mirch ka salan translates to? It means 'green chili curry' in English. So, basically you will be making a curry of green chillies using this Hyderabdi recipe.
Story first published: Monday, April 1, 2013, 12:02 [IST]
Desktop Bottom Promotion