For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్... మీల్ దేనికైనా సరే- పెసరపప్పు కిచిడి

|

కిచిడి వంటకం సౌత్ ఇండియాలో చాలా ఫేస్. కిచిడిని బియ్యం, పెసరపప్పుతో తయారు చేసేటటువంటి మంచి కాంబినేషన్. అంతే కాదు వీటిలో కొన్ని మసాలా దినుసులు చేర్చడం వల్ల మరింత టేస్ట్ గా ఉంటుంది. పసుపు వర్ణంలో ఉండే ఈ ఎల్లో ఫుడ్ పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా ఇష్టం ఎందుకంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే జారిపోయే విధంగా ఉంటుంది.

మూగ్ దాల్ కిచిడిలో చాలా న్యూట్రిషియన్స్ ఉంటాయి. జీర్ణం అవ్వడం కూడా చాల సులభం. మరియు ఇది శరీరంలోని వేడి తగ్గిస్తుంది. కడుపు నిండుగా ఉండి ఆకలిని తగ్గిస్తుంది. మరిఇంకెదుకు ఆలస్యం మూగ్ దాల్ కిచిడి చేసేయండి.....

బియ్యం: 1cup(soaked and cleaned)
పెసరపప్పు: 1cup(soaked and washed)
జీకలర్ర: 1tsp
ఎండు మిర్చి: 2
బిర్యాని ఆకు: 1
ఇంగువ: 1pinch
పచ్చిమిర్చి: 2(chopped)
క్యారెట్: 1(chopped)
ఫ్రెంచ్ బీన్స్: 10(chopped)
వంకాయ: 100 grams(chopped)
పచ్చిబఠానీ: 100 grams(shelled)
అల్లం: 1 inch(grated)
టమోటో: 1(chopped)
గరం మసాలా: 1tsp
పసుపు: 1 pinch
జీలకర్ర పొడి: 1tsp
ఉప్పు :రుచికి సరిపడా
నెయ్యి: 1tbsp

Moong Dal Khichdi

తయారు చేయు విధానం:
1. కుక్కర్ లో నెయ్యి వేసి కరిగించాలి. అందులో ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బిర్యాని ఆకు ఒక దాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే అల్లం తురుము వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి.
3. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్ని వెజిటేబుల్స్, క్యారెట్,వంకాయ, బీన్స్, పచ్చిబఠానీ వీటితో కూడా అన్నింటినీ వేసి, మరో ఐదు నిముషాలు మంట తగ్గించి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే బియ్యం, మరియు మూంగ్ దాల్(పెసరపప్పు)కూడా వేసి మరో రెండు నిముషాలు మగ్గనివ్వాలి.
5. చివరగా టమోటోముక్కలు మరియు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, జిలకర్రపొడి, గరం మసాలా వేసి మరో ఐదు నిముషాలు వేయించి తర్వాత 3 కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద పెట్టి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మూంగ్ దాల్ కిచిడి రెడీ. ఈ రెండింటిని పెరుగు, పికెల్ మరియు పప్పడ్ తో వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

English summary

Moong Dal Khichdi Recipe | మూగ్ దాల్ కిచిడి ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్

Khichdi recipes are common throughout India. Moong dal khichdi is one of the most popular versions of this dal and rice recipe. A khichdi recipe basically consists of dal and rice cooked together with some spices. Moong dal khichdi is a very good dish for kids because it soft and easy to swallow.
Story first published: Thursday, February 7, 2013, 18:35 [IST]
Desktop Bottom Promotion