For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు సాంబార్-బ్రేక్ ఫాస్ట్ కు బెస్ట్ కాంబినేషన్

|

ఇడ్లీ, దోస, సాంబార్ వడ మరియు వివిధ రకాల వెరైటీ రైస్ రిసిపిలు సౌత్ ఇండియాలో చాలా పాపులర్ వంటకాలు. ఇడ్లీ చాలా తేలికగా, సులభంగా జీర్ణం అయ్యే ఆహారం. ఇందులో ఎటువంటి నూనెలు వాడకపోవడం వల్ల ఇది లోఫ్యాట్స్ మరియు లోక్యాలరీ బ్రేక్ ఫాస్ట్. ఇడ్లీలు తయారు చేయడం చాలా సులభం. అంతేకాదు ఇడ్లీకి సాంబార్, చట్నీ లేదా ఇడ్లీ పౌడర్ చాలా మంచి కాంబినేషన్.

సాంబార్ చాలా రుచికరంగా..కారంగా ఉంటుంది. సాంబార్ ను పెసరపప్పుతో తయారు చేయడం వల్ల కమ్మగా ఉండటమే కాదు, ఆరోగ్యం కూడా. మరి ఈ బ్రెక్ ఫాస్ట్ కాంబినేషన్ సాంబార్ ను ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 2cups
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4-5
టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1/4tsp
కారం: 2tsp
ధనియాల పొడి: 2tsp
చింతపండుగుజ్జు: 1tsp
సాంబార్ పౌడర్: 1tsp
బెల్లం/పంచదార: 1/2tsp
కరివేపాకు: 3
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును ఒక గిన్నెలో వేసి బాగా శుభ్రం చేయాలి. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో వేసి 2-3విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, 5నిముషాలు ఆవిరి అంతా తగ్గే వరకూ ఉండి తర్వాత మూత తీసి, అందులో చింతపండు గుజ్జు, పసుపు, కారం, ధనియాలపొడి, సాంబార్ పౌడర్, మరియు ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక, ఒక సెకన్ తర్వాత కరివేపాకు, తర్వాత వెంటనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి
3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారగాని అందులో కట్ చేసి పెట్టుకొన్న టామోటో ముక్కలు వేసి, టమోటో మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
4. టమోటో మెత్తగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న పెసరపప్పు మిశ్రమాన్ని పోపులో పోయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. సాంబార్ కొద్దిగా చిక్కబడగానే స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే పెసరపప్పు సాంబార్ రెడీ. ఇది సులభమైన బ్రేక్ ఫాస్ట్ రిసిపి. ఇది ఇడ్లీకి అద్భుతమైన కాంబినేషన్. ఇడ్లీ, చట్నీ, పెసరపప్పు సాంబార్ తో వేడి వేడి గా సర్వ్ చేస్తే బ్రేక్ ఫాస్ట్ ఫుల్ అయినట్టే...

English summary

Moong Dal Sambhar: Breakfast Recipe

Idli, dosa, sambar vada and different types of rice are popular breakfast ideas in South India. Idli is easy to digest, low in fats and calories and most importantly, filling. Idlis are easy to prepare and can be teamed up with sambhar, chutney or idli powder.
Desktop Bottom Promotion