For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోర్ కుజంబు(మజ్జిగ పులుసు): ఉగాది స్పెషల్

|

ఈ రోజు మీకోసం ఒక ఉగాది స్పెషల్ వంటకంను అందిస్తున్నాం. దీన్ని మోర్ కుజంబు అని పిలుస్తారు. పెరుగుతో తయారుచేసే ఈ వంటను సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ రిసిపిగా పిలుస్తారు.

మోర్ అంటే మజ్జిగ కుజంబు అంటే పులుసు. ఈ మజ్జిగ పులుసును మజ్జిగతో తయారుచేస్తారు మరియు దీన్ని తయారుచేయడానికి కొన్ని పోపుదినుసులు మరియు మసాలా దినుసులు కూడా ఉపయోగిస్తారు. ఈ వంట తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టడు. మరియు ఇది ఆరోగ్యానికి చాలా మేలు మరియు చలువ చేస్తుంది. పొట్టను చల్లగా ఉంచుతుంది. పుల్లని రుచి ఫ్లేవర్ కలిగిన ఈ మజ్జిగ పులుసును ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mor Kuzhambu(Majjiga Pulusu): Ugadi Recipe
కావల్సిన పదార్థాలు:
పెరుగు: 1cup
తెల్లగుమ్మడికాయ: 1cup(చిన్న ముక్కలుగా తరిగినవి)
కొబ్బరి తురుము: ½cup
జీలకర్ర: ½tsp
పచ్చిమిర్చి: 2(మద్యలోకి కట్ చేయాలి)
మెంతులు:¼ tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: ½tsp
నీళ్ళు: ½ cup
పోపుకోసం:
ఆవాలు: ¼ tsp
జీలకర్ర ¼ tsp
కరివేపాకు 6-7
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగినవి)
ఆయిల్: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, మరియు జీలకర్రను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని స్పూన్ తో బాగా కలియబెట్టాలి.
3. తర్వాత చిలికి పెట్టుకొన్న పెరుగులో మెంతులు, నీళ్ళు, కొబ్బరి తురుము పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి వేడి చేయాలి. తర్వాత అందులో పెరుగు మిశ్రమాన్ని పోయాలి.
5. తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి తక్కువ మంట మీద 5-6నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి
తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న పెరుగు కర్రీని అందులో పోయాలి.
8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మోర్ కుజంబు రెడీ. అన్నంతో ఈ స్పెషల్ రిసిపిని సర్వ్ చేయవచ్చు.

English summary

Mor Kuzhambu(Majjiga Pulusu): Ugadi Recipe

Today we have another Ugadi special recipe for you. It is known as the Mor Kuzhambu. It is one of the traditional recipes of South India which is prepared with yogurt.
Story first published: Thursday, March 27, 2014, 18:10 [IST]
Desktop Bottom Promotion