For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోతియ పలావ్ : నవరాత్రి స్పెషల్ రిసిపి

|

వసంత నవరాత్రి రిసిపిలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే వంటలను ఉల్లిపాయ , వెల్లుల్లి ఉపయోగించకుండా తయారుచేస్తారు . అంతే కాకుండా నవరాత్రి సమయంలో ఈ వంటలకు రాక్ సాల్ట్ ను కూడా ఉపయోగిస్తారు. మోతియ పలావ్ ట్రెడిషనల్ రిసిపి కాదు. అయితే నవరాత్రి ఉపవాస సమయంలో ఈ వంటను ప్రత్యేకంగా తయారుచేస్తారు . రాజస్తాన్ లో ఈ పులవ్ ను నాన్ వెజ్ తో వండుతారు.

అయితే, ఈ రోజు మీకు అందిస్తున్న ఈ స్పెషల్ నవరాత్రి వంట ప్యూర్ వెజిటేరియన్ రిసిపి . నవరాత్రి ఉపవాస దీక్ష సమయంలో ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది . ముఖ్యంగా పనీర్ తురుముతో తయారుచేసిన గోల్డెన్ ఫ్రైడ్ బాల్స్ మరింత టేస్ట్ గా చేస్తుంది. అయితే ఈ పలావ్ రిసిపి తయారుచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది.

Motia Pulao: Navratri Special Recipe

కావల్సిన పదార్థాలు:

బాస్మతి రైస్ : 2cups
నెయ్యి: 4tbsp
పనీర్: 100grms(తురుము కోవాలి)
మైదా: 1cup
కోవ లేదా చిక్కటి పాలు: 1/2cup
పచ్చిమిర్చి: 3(మద్యకు చీల్చి కట్ చేసుకవాలి)
టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీ తరుగు : కొద్దిగా
రాక్ సాల్ట్ : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో శుభ్రంగా కడిగి నానబెట్టుకొన్న బాస్మతి బియ్యం వేసి 2, 3 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు 3కప్పులు నీటిని ప్రెజర్ కుక్కర్ లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉంచి అన్నం వండుకోవాలి.
3. అంతలోపు, కోవ, పిండి, మరియు పనీర్ తురుమును ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేసి ఉప్పు కూడా చేర్చాలి.
4. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమానికి కొద్దిగా నెయ్యి మరియు నీళ్ళు వేసి పిండిని మ్రుదువుగా కలుపుకోవాలి.
5. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి.
6. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, వేడికి కరిగిన తర్వాత , ఈ పిండి నుండి తయారుచేసిన బాల్స్ ను అందులో వేసి ఫ్రై చేసుకోవాలి . కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇది 5 నిముషాలు పడుతుంది. తర్వాత అందులోనే టమోటో మరియు పచ్చిమిర్చి , కొద్దిగా ఉప్పు వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి .
8. మొత్తం మిశ్రమం ఫ్రై చేసుకొన్న తర్వాత ముందుగా వండి పెట్టుకొన్న అన్నం అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
9. రెండు నిముషాల తర్వాత అందులో నెయ్యిలో ఫ్రై చేసుకొన్న పిండి బాల్స్ ను మరియు కొత్తిమీర తరుగు అందులో వేసి మరో 5నిముషాలు మీడియం తక్కువ మంట మీద ఉంచి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే మోటియా పలావ్ రిసిపి రెడీ.

English summary

Motia Pulao: Navratri Special Recipe


 Navratri recipes are different because they are cooked without onions and garlic. Besides you must also use a special sendha namak or rock salt for cooking food during Navratri. Motia pulao is not traditionally a dish that is prepared only for Navrtari. In fact the authentic Rajasthani motia pulao can also be cooked with meat.
Story first published: Friday, April 4, 2014, 9:46 [IST]
Desktop Bottom Promotion