For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముంబాయ్ స్పెషల్ టమోటో పులావ్ రిసిపి

|

టమోటో పలావ్ బాగా ప్రాచుర్యం చెందినటువంటి వంటకం. కొంచెం వెరైటీగా సీజనల్ వెజిటేబుల్స్ చేర్చి వండితే మరింత రుచిగా ఉంటుంది. అంతే కాదు ముంబాయ్ స్పెషల్ టమోటో పలావ్ లో పనీర్, పచ్చిబఠానీలు, వెల్లుల్లిపాయలు వంటివి జోడించడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. టమోటా వినియోగించడంలో అందులో సి విటమిన్ ఎక్కువ శరీరానిక చేరుతుంది. శరీరానికి కావలసిన విటమిన్స్, ప్రోటిన్స్ కూడా అందుతాయి.

టమోటో పులావ్ రిసిపి ముంబాయ్ సిటిలో చాలా ఫేమస్. ఈ ముంబాయ స్పెషల్ టమోటో పులావ్ రిసిపి, ఒక అద్భుతమైన రుచికలిగి వెజిటేరియన్ రిసిపి. ఈ వంటను చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ రైస్ రిసిపిని సింగిల్ మీల్ , అలాగే లంచ్ బాక్సులకు తీసుకెళ్లవచ్చు. ఈ సీజన్ లో మార్కెట్లో అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఎంపిక చేసుకొని ఈ వంటను స్పెషల్ గా వండుకోవచ్చు.

ఈ ముంబాయ్ స్పెషల్ టమోటో రిసిపికి టమోటో కెచప్ ఉపయోగించడం వల్ల మరింత స్పెషల్ టేస్ట్ ను అందిస్తుంది. స్వీట్ అండ్ ట్యాంగీ రుచితో ఉండే కలర్ ఫుల్ టమోటో పులావ్ ను మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఈ వంటలో తీపి, కారం, ఉప్పు మరియు స్పైసీ ఫ్లేవర్ వల్ల మరింత ఎక్కువ ఇష్టపడేలా చేస్తుంది. మరి ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Serves: 3 Preparation
time: 10 minutes
Cooking time: 20 minutes

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్ - 2 cups(వండిపెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటాలు : 3 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పనీర్: : 1/2cup(మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
పచ్చిబఠానీలు: 1/2cup
పచ్చిమిర్చి: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పావ్ భాజీ మసాలా: 2tsp
ఉప్పు రుచికి సరిపడా
నూనె: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(గార్నిష్ కోసం)రిగి)
టొమాటో కెచప్: 1/4cup
కారం పొడి: 1tsp
పసుపు: 1/2 tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో టమోటో, పసుపు, కారం, పావ్ బాజీ మసాల వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే టమోటో కెచప్ కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే క్యాప్సికమ్, పచ్చిమిర్చి , పచ్చిబఠానీలు, ఉప్పు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు పనీర్ క్యూబ్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు అందులో పోసి వెజిటేబుల్స్ అన్నీ మీడియం మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి.
7. మొత్తం ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ముంబాయ్ స్పెషల్ టమోటో పులావ్ రిసిపి రెడీ. దీన్ని మీకు నచ్చిన కర్రీతో తినవచ్చు.

న్యూట్రిషియన్ విలువలు: ముంబాయ్ స్పెషల్ టమోటో పులావ్ న్యూట్రిషియన్ రిసిపి. ఈ వంటకోసం ఈ సీజన్ లో మనకు అందుబాటులో ఉండే కూరగాయలను ఉపయోగిస్తుంటారు. మరింత హెల్త్ కాన్షియస్ ఉన్నవారు, బ్రౌన్ రైస్ తో ీ వంటను వండువకోచ్చు.

Mumbai Special Tomato Pulao Recipe

English summary

Mumbai Special Tomato Pulao Recipe

Winter is the time for the red, juicy and succulent tomatoes. Though the vegetable is available throughout the year, yet winter tomatoes have a special taste. So, today we have a special rice recipe with tomatoes. It is a specialty of the Mumbai city. This Mumbai special tomato pulao is an easy yet delectable vegetarian recipe.
Story first published: Friday, December 5, 2014, 13:38 [IST]
Desktop Bottom Promotion