For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్భుతమైన రుచి మష్రుమ్ బట్టర్ మసాలా

|

మష్రుమ్(పుట్టగొడుగులు)బట్టర్ మసాలా కర్రీ కారంగా ఉండే ఓ అధ్భుతమైన వంటకం. ఇది పన్నీర్ బట్టర్ మసాలా లాగా ఉంటుంది. ఈ రెండు వంటలకు ఒకరకమైన మసాలాదినుసులు అవసరం అవుతాయి. పన్నీర్ కు బదులు మష్రుమ్ ను ఉపయోగిస్తారు అంతే..

ఈ స్పైసీ గ్రేవీ కర్రీ సైడ్ డిష్ కు అద్భుతంగా నప్పుతుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
పుట్టగొడుగులను: 200gms
ఉల్లిపాయలు: 2(తరిగిన)
టమోటా : 2(తరిగిన)
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్: 1tsp
జీడిపప్పు:10-15(నానబెట్టి, ఒక ముద్ద లోకి గ్రౌన్దేడ్)
లవంగాలు: 2
దాల్చిన:1 అంగుళం
పాల: 2tbsp
కారం: 1tsp
కారం: 2
గరం మసాలా: 1tsp
మెంతి కూర: 1tsp
కుంకుమ పువ్వు: ఒక చిటికెడు
కొత్తిమీర: 3tbsp(తరిగిన)
వెన్న: 1 ½ tbps
నెయ్యి: 3tbsp
ఉప్పు: రుచికి తగినంత

Mushroom Butter Masala

తయారు చేయు విధానం:
1. ముందుగా మష్రుమ్ ను స్లైస్ గా కట్ చేసుకోవాలి.
2. తర్వాత చిన్న బౌల్ తీసుకొని అందులో కుంకుమ పువ్వు మరియు పాలు పోసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నెయ్యివేసి కాగాక, అందులో లవంగాలు, చెక్క, మెంతులు, ఎండు మిర్చి వేసి వేగించాలి.
4. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటో, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. మంట తగ్గించి అన్ని పచ్చివాసన పోయేంత వరకూ వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే కారం మరియు గరం మాసాలా వేసి మరో నిముషా వేగించాలి. స్టౌ ఆఫ్ చేసి ఈ వేగించుకొన్న మిశ్రమాన్నా చల్లారనివ్వాలి.
6. వేగించుకొన్న మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్ళు కలుపుకోవచ్చు.
7. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో వెన్న వేసి కరగనివ్వాలి. ఇన్పుడు అందులో మష్రుమ్ ముక్కలు వేసి ఉప్పు చల్లి తక్కువ మంట మీద వేగిస్తూ ఉడికించుకోవాలి.
8. మష్రుమ్ వేగిన తర్వాత అందులో పేస్ట్ చేసిన పెట్టుకొన్నా మసాలా వేసి ఒక నిముషం వేగించి తగినన్ని నీళ్ళు పోసి, ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే మష్రుమ్ బట్టర్ మసాలా రెడీ.

English summary

Mushroom Butter Masala Recipe | మష్రుమ్ బట్టర్ మసాలా వెరీ టేస్టీ కర్రీ

Mushroom butter masala is a spicy and delicious side dish like paneer butter masala. Both the gravies are prepared with almost same ingredients. Only the paneer is replaced with mushroom pieces. The rich and spicy gravy can be an excellent side dish for any meal. Mushroom butter masala is an easy to prepare recipe. The aroma of spices and butter can make you crave for this dish. Here is the recipe to prepare mushroom butter masala.
Story first published: Saturday, March 2, 2013, 12:07 [IST]
Desktop Bottom Promotion