For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ

|

ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ. ఇది సౌత్ ఇండియన్ స్పెషల్ మష్రుమ్ మసాలా కర్రీ. ఈ కర్రీ స్పైసీగా మరియు స్వీట్ ఫ్లేవర్ తో నూరూరిస్తుంటుంది. ఈ వంటకు ఇంతట ఫ్లేవర్ రుచి రావడానికి కారణం ఇందులో కొన్ని రకాల ఫ్లేవర్డ్ మసాలాలు మరియు జీడిపప్పు, గసగసాలు ఉపయోగించడమే.

మరి ఈ ఆంధ్రా స్టైల్ మసాల మష్రూమ్ కర్రీ మీరూ టేస్ట్ చేయాలంటే..ఇది ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం..

Mushroom Curry-Andhra Style

కావల్సిన పదార్థాలు:
పుట్టగొడుగులు: 1/2kg
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 3
కారం: 1tsp
పసుపు: 1/2tsp
కొత్తిమీర: ఒక కట్ట
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రిచికి తగినంత

మసాలా ముద్ద కోసం:
అల్లం తురుము: 1tsp
వెల్లుల్లి: 2రెబ్బలు
జీలకర్ర: 1tsp
గసగసాలు: 1tsp
జీడిపప్పు: 5-6
యాలకులు: 2
చెక్క: చిన్న ముక్క
ధనియాలు : 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా తరగాలి.
3. మసాలా ముద్దకోసం సిద్దంగా పెట్టుకొన్న పదార్థాలన్ని మిక్సీలో వేసి, అవసరం అయితే కొద్దిగా నీళ్ళు సోసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కారం, పుట్టగొడుగుల ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఐదు నిముషాలు వేయించాలి.
5. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత మసాలా ముద్ద వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
6. చివరగా క్రిందికి దింపుకొనే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, తర్వాత దింపుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ..

English summary

Mushroom Curry-Andhra Style

Andhra Style Mushroom curry is also known as South Indian Mushroom Curry. It has more number of spices and a quite sweet flavour of Cashews and poppy seeds. The curry is best to serve with rice or chapati.
Story first published: Saturday, June 22, 2013, 14:23 [IST]
Desktop Bottom Promotion