For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రుమ్ పెప్పర్ రైస్ రిసిపి

|

సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది మష్రుమ్(పుట్టగొడుల)రుచి, వాసన పట్టదు. అటువంటి వారు ఈ మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.

మష్రుమ్ క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు మన శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరి మీరు కూడా మష్రుమ్ టేస్ట్ చేయాలన్నా, లేదా మీ ఇంటికి వచ్చిన అథితులకు ఒక కొత్త రుచి చూపించాలన్నా మష్రుమ్ పెప్పర్ రైస్ ట్రై చేయండి. ఈ మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలుం

రైస్ - 1 ½ కప్పులు
పుట్టగొడుగుల - 500 gms
పెప్పర్-2tbsp
ఉల్లిపాయలు - 2tbsp
కారం - 1tbsp
ఆవాలు పౌడర్ - 1 tsp
ధనియాల పొడి - 1 tsp
పచ్చిమిరపకాయలు - 1(సన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
వెన్న - 1tbsp
నూనె - 2tbsp
ఉప్పు- రుచికి సరిపడా

Mushroom Pepper Rice Recipe

తయారుచేయు విధానం:

1. ముందుగా పొడిపొడిగా అన్నం వండుకోవాలి. వండుకొన్న తర్వాత అన్నంను ఒక ప్లేట్ తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. వేడి చేసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ రెండు బాగా వేగిన 5 నిముషాల తర్వాత అందులో కారం, ఆవాల పొడి, ధనియాలపొడి, కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
4. మొత్తం వేగిన తర్వాత అందులో మష్రుమ్(పుట్టగొడుగులు) వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత అందులో పెప్పర్ పౌడర్ వేసి వేయించుకవోాలి.
5. మొత్తం మిశ్రమం మరో 5-10నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి మొత్తం మిశ్రమంను కలగలుపుకోవాలి. మొత్తం మిశ్రమం పది నిముషాలు మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. పూర్తిగా వేగించుకొన్న తరవ్ాత అందులో ఉప్పును చిలకరించాలి. అంతే మష్రుమ్ పెప్పర్ రైస్ రెడీ.

English summary

Mushroom Pepper Rice Recipe


 Tired of preparing two dishes for the night? Here is one of the easiest dinner recipes you can prepare tonight. It is simple and does not take too much time too. What you would like most about this recipe is how quickly you can prepare it.
Story first published: Saturday, May 3, 2014, 12:53 [IST]
Desktop Bottom Promotion