For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అండ్ మీల్-మటర్ పనీర్ రోల్స్

|

పనీర్ లేదా టోఫు అనేది ఒక డైరీ ప్రొడక్ట్. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా. వెన్న తీసిన పాలతో లేదా లో ఫ్యాట్ మిల్క్ తో తాయరు చేస్తారు. మన రెగ్యులర్ డైట్ లో నిరభ్యరంతంగా చేర్చుకోగల హెల్తీ ఫుడ్ పనీర్. శాఖాహారలు చాలా వరకూ పనీర్ ను వారి వంటకాల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు పనీర్ తో తయారు చేసే కరీ లేదా స్నాక్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే కాదు తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలకోసం తయారు చేసే వంటకాల్లో ఇటువంటి ఆహారాలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది.

పిల్లలు బాగా చదవడం ఒక సంగతి. బాగా తినడం ఒక సంగతి. బాగా తిన్నా బలమైనది తినడం మరో సంగతి. స్కూలు బెంగలో, స్కూలు హుషారులో కొత్త పుస్తకాల మోజులో, కొత్త టీచర్ల భయంలో పిల్లలు సరిగా తినరు. వాళ్లకు కావల్సింది ఇక్కడ ఇస్తున్నాం. చేయండి. ఊరించండి. వాళ్ల చేత లొట్టలు వేయించండి.

కావలసిన పదార్థాలు:
పనీర్: పావు కేజీ (పనీర్ ముక్కలను నెయ్యిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కనుంచాలి)
పచ్చిబఠాణీలు: చిన్న కప్పు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి)
అల్లం: చిన్న ముక్క (పేస్ట్ చేయాలి)
పచ్చిమిర్చి: 3 (పేస్ట్ చేయాలి)
టొమాటోలు: 2 సన్నగా తరగాలి)
కారం: పావు టీ స్పూన్ (తగినంత)
పసుపు: చిటికెడు
ధనియాల పొడి: టీ స్పూన్
కసూరి మెంతి (మెంతి ఆకుల పొడి మార్కెట్లో లభిస్తుంది): అర టీ స్పూన్
గరం మసాలా: చిటికెడు
మీగడ: టీ స్పూన్ క్రీమ్ అయ్యేలా స్పూన్‌తో చిలకాలి
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగిన్నెలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేయించుకోవాలి.

2. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ధనియాలపొడి పసుపు కారం ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి.

3. టొమాటో తరుగు వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి మంట తీసేయాలి. చల్లారిన తర్వాత గరిటెతో లేదా మిక్సీలో వేసి పేస్ట్ చే యాలి.

4. టొమాటో పేస్ట్‌లో కప్పు నీళ్లు చేర్చి మళ్లీ మరిగించాలి. మంట తగ్గించి దీంట్లో పచ్చి బఠాణీలు వేసి ఉడికించాలి. తర్వాత పనీర్ ముక్కలు ఉప్పు వేసి 8 నిమిషాలు ఉడకనివ్వాలి.

5. మీగడ గరంమసాలా కసూరి మెంతి పొడి వేసి కలిపి కొద్దిగా ఉడికించి మంట తీసేయాలి.

6. థిక్‌గా అయితే కొద్దిగా పాలు కలపాలి. ఈ మటర్ పనీర్‌ను రోటీ మధ్యలో పెట్టి రోల్ చేసి బాక్స్‌లో పెట్టాలి లేదా విడిగానూ బాక్స్‌లో పెట్టి ఇవ్వవచ్చు.

English summary

Mutter Paneer Rolls-Healthy Breakfast and Meal too

Paneer or tofu is a diary product that has many health benefits. If made with skimmed or low fat milk, paneer can be a healthy food that can be easily included in the diet. Vegetarians prefer adding this ingredient to many of the dishes.
Desktop Bottom Promotion