For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైసూర్ మసాలా దోసె: బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

దోసె ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి, ఇది సౌత్ లోనే కాదు, ఇండియాలో ప్రతి చోట దోసెకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ కాబట్టి బాగా ప్రాచుర్యం పొందింది. ఇల్లలో కనీసి వారంలో ఒక్క సారానై చేసి తీరాల్సిందే. కానీ ఇల్లలో తయారుచేసే దోసె ప్లెయిన్ దోస దానికి చట్నీ లేదా బంగాళదుంప వేపుడు లేదా కర్రీ చాలా ఫేమస్ కాంబినేషన్ .

ఐతే ఈ కాంబినేషన్ లో రెగ్యులర్ గా తిని బోరుకొడుతుంటే, కొంచెం తయారు చేసే విధానం, టేస్ట్ మార్చి చూడండి. ఇంట్లో మళ్ళీ దోసెలే మిగలవు. అందులోనే మసాలా దోసె అంటే ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరికీ చాలా ఇష్టం. మరి కొంచెం డిఫరెంట్ టేస్ట్ చేయాలంటే మైసూర్ మసాలా దోసె ఎంపిక చేసుకోండి. టేస్ట్ చేయండి..ఎంజాయ్ చేయండి..

Mysore Masala Dosa

కావల్సిన పదార్థాలు:
దోసె కోసం:
బియ్యం: 1cup
ఉద్దిపప్పు:1cup
చనా పప్పు:2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

మసాలా కోసం:
బంగాళ దుంపలు :2 (ఉడికించి,గుజ్జులా తయారు చేసుకోవాలి)
ఉల్లిపాయలు:2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిరపకాయలు:2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 3 రెబ్బలు(చితగొట్టుకోవాలి)
పసుపు:1tsp
ఉప్పు: రుచికి ప్రకారం

రెడ్ పచ్చడి కోసం:
రెడ్ చిల్లీస్: 4-5
వేగించిన శెనగపప్పు: ½cup
కొబ్బరి: ½cup(తురుము)
వెల్లుల్లి: 2cloves
చింతపండు గుజ్జు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానము:
1. ముందుగా బియ్యం మరియు పప్పులు శుభ్రంగా కడిగి3-4గంటల పాటు నానబెట్టుకోవాలి . తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని, ఒక గిన్నెలోకి తీసి, కొద్దిగా ఉప్పు వేసి 6-8గంటలు పిండిని పులయబెట్టుకోవాలి.
2. మరుసటి రోజు ఉదయం, రెడ్ చట్నీకి సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పిండి ఒక చిన్న గిన్నెలో సరిపడా తీసుకొని అందులో మరికొంత ఉప్పు, బేకింగ్ షోడా కొద్దిగా వేసి, బాగా మిక్స్ చేయాలి. అంత లోపు స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు వేసి, బాగా వేగించి తర్వాత ఉడికించి గుజ్జులా తయారు చేసుకొన్న బంగాళదుంపను కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
5. ఒక్కసారి అన్ని కలగలిసి రెండు, మూడు నిముషాలు వేగిన తర్వాత చల్లారనివ్వాలి.
7. ఇప్పుడు తవా హీట్ చేసి నూనె రాసి దాని మీద దోసె పిండిని దోసెలా పోసుకోవాలి. దాన్ని రౌండ్ గా చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నిండుగా రెడ్ చట్నీ తీసుకొని దోసె మీద పూర్తిగా స్పూన్ తో రాయాలి.
8. దోసె రెండు నిముషాలు కాలిన తర్వాత దోసె మద్యలో బంగాళదుంప మిశ్రమాన్ని ఒక ఫుల్ గరిటెడు పెట్టాలి.
9. తర్వాత , దోసె చివర్లలో లైట్ గా నూనె చిలకరించాలి. తర్వాత దోసెను ఒక సైడ్ ను ముందుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా చేసుకొన్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని, వేడి వేడి గా సర్వ్ చేయాలి అంతే మైసూర్ మసాలా దోసె రెడీ ఫర్ బ్రేక్ ఫాస్ట్..

English summary

Mysore Masala Dosa: Breakfast Recipe

Dosa is a favourite breakfast recipe, not only in South but in almost everywhere in India. It is a comforting, crispy and totally addictive dish which can be enjoyed at any time of the day. Masala dosa is hit among all age groups.
Story first published: Friday, July 26, 2013, 11:36 [IST]
Desktop Bottom Promotion