For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి రిసిపి: సింగరె కి పూరి: బెంగాళీ స్పెషల్

|

దసరా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు.

నవరాత్రి స్పెషల్ గా ఇక్కడ ఒక స్పెషల్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాం . నవరాత్రికి ఉపవాసదీక్షలు చేసే వారు , ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసం ఉన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అలాంటి పోషకాహార వంటల్లో సింగరెకి పూరి ఒకటి. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నవరాత్రి సమయంలో స్పెషల్ గా తయారుచేసుకొనే ఈ వంటను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Navratri Recipe: Singhare Ki Poori

కావల్సిన పదార్థాలు:
సింగారే(వాటర్ చెస్ట్నట్)పిండి: 2cup
బంగాళదుంపలు: 2(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
ఆకు కూర: ¼cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వాము (క్యారమ్ గింజలు): ½tbsp
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు పిండి కలుపుకోవడానికి సరిపడా
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నూనె మరియు నీళ్ళు తప్పించి మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి.
3. ఇప్పుడు డీప్ బాటమ్ కడాయ్ ను స్టౌ మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
4. నూనె కాగేలోపు కలుపుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా పిండి తీసుకొని ఉండలు చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి
5. ఇప్పుడు వీటిని కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ రెండు వైపులా కాల్చుకోవాలి.
6. ఇలా మొత్తం పూరీలను తయారుచేసుకోవాలి. అంతే సింగారె కి పూరి రెడీ ఈ వంటను నవరాత్రి స్పెషల్ గా తినవచ్చు.

English summary

Navratri Recipe: Singhare Ki Poori

Singhare ka atta or the water chestnut flour is one of the special ingredients which can be used in preparation of various dishes to be eaten during fast. Since the Navratri fast has commenced, we thought of introducing a special vrat recipe with which you can start your day.
Desktop Bottom Promotion