For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్ళీ.. మళ్ళీ తినాలనిపించే ‘నీరు దోసె’

మళ్ళీ.. మళ్ళీ తినాలనిపించే ‘నీరు దోసె’

|

'దోసె' సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్. దోసెలో కూడా వివిధ రకాలున్నాయి. ప్లెయిన్ దోసె, ఆనియన్ దోసె, మసాలా దోసె, ఎగ్ దోసె, ఇలా... ఈ దోసెలు ఒక్కోరకమైన టేస్ట్ ను అందిస్తాయి. వీటితో పాటు మరో కొత్త రుచిని రుచిచూడాలిపిస్తే ఈ నీరు దోసె ప్రయత్నించవచ్చు. ఇది అన్ని రకాల దోసె ఐటమ్స్ కంటే కొంచె డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. చూడాటానికి మల్లెపువ్వు కాంతితో మెరిసిపోతూ పేపర్ లా అతి పలుచగా ఉంటుంది.

ఈ నీరు దోసె అంత అద్భుతమైన రుచి అందించడానికి కారణం, అందులో కలుపుకొనే పచ్చికొబ్బరి పాలు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లోక్యాలరీలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ నీరు దోసె కర్ణాటకలో చాలా ప్రసిద్ది. ఈ నీరు దోసెను టమోటో లేదా కొబ్బరి చట్నీలేదా ఫిష్ కర్రీతో తింటే చాలా అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది. మరి ఇంకెదుకు ఆలస్యం....

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 2 cups(బియ్యాన్ని శుభ్రం చేసి, నీళ్ళలో రాత్రంతా నాబెట్టాలి)
పచ్చి కొబ్బరి తురుము: 1cup
జీలకర్ర: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నీళ్ళు: పిండి రుబ్బుకోవడానికి సరిపడా

Neer Dosa

తయారు చేయు విధానం:
1. ముందుగా రాత్రంతా నానబెట్టి పెట్టుకొన్న బియ్యంలో నీరు వంపేసి ఆ బియ్యాన్ని మరియు కొబ్బరి తురుమును మెత్తని పేస్ట్ లా (తగినన్ని నీళ్ళు కలుపుతూ చిక్కటి పాలులా, పిండిని) గ్రైండ్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి.(కొబ్బరి తురుము విడిగా కూడా గ్రైండ్ చేసి ఆ పాలను పిండిలో కలుపుకోవచ్చు).
2. ఒక గంట తర్వాత గ్రైండ్ చేసిన పిండిలో జీలకర్ర, ఉప్పు మరియు చెంచా నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు దోస పాన్ స్టౌమీద పెట్టి వేడిఅయ్యాక దోసె పిండిని దోసెలా వేయాలి.
4. ఈ పలుచని దోసె పిండి పాన్ మొత్తం అమరేలా పాన్ ను మరో చేత్తో పట్టుకొని వంచి దోసె వేయవచ్చు.
5. తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ చిలకరించి మరో నిముషం పాటు కాలనివ్వాలి. ఈ దోసెను రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. పలుచగా ఉండటం వల్ల పూర్తిగా కాలుంటుంది. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. అంతే సర్వ్ చేయడానికి టేస్టీ నీరు దోసె రెడీ.

ఈ రుచికరమైన నీరుదోసెను టమోటో చట్నీ లేదా కొబ్బరి చట్నీతో ఆరగించవచ్చు.

English summary

Neer Dosa-Tasty Dosa | చాలా మంచి టేస్ట్ ఉండే నీరు ‘దోసె’

Neer Dosa Recipe – a light, soft, lacey and delicious dosas from the Karnataka region. These are prepared mainly with soaked rice and fresh grated coconut. Also, no fermentation process required for neer dosa. They taste great with chutney, tomato chutney, sambar, veggies or fish curries.
Desktop Bottom Promotion