For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్స్ ఖారాబాత్: హెల్తీగా బరువు తగ్గించే రిసిపి

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా ముందు ప్లెయిన్ ఓట్స్ పాలల్లో కలుపుకొని తినేవారు. తర్వాత తర్వాత మసాలా ఓట్స్ అంటూ ప్రస్తుతం మార్కెట్టో విరివిగా దొరుకుతున్నాయి. ప్లెయిన్ ఓ

|

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా ముందు ప్లెయిన్ ఓట్స్ పాలల్లో కలుపుకొని తినేవారు. తర్వాత తర్వాత మసాలా ఓట్స్ అంటూ ప్రస్తుతం మార్కెట్టో విరివిగా దొరుకుతున్నాయి. ప్లెయిన్ ఓట్స్ ఇష్టం లేనివాళ్ళు మసాలా ఓట్స్ తింటారు. అయితే ఇవన్నీ కాకుండా ఓట్స్ కు మరికొన్ని హెల్తీ వెజిటేబుల్స్ జోడించి తయారుచేసుకొనే ఓట్స్ ఖారాబాత్ చాలా టేస్ట్ గా ఉంటుంది.

ఓట్స్ చాలా వరకూ పాలల్లో మిక్స్ చేసుకొని తింటారు. ప్లేయిన్ ఓట్స్ ను కొంచెం వెరైటీగా కొన్ని మసాలాలు దంటించి కారాబాత్ లా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా...పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ ఓట్స్ కారా బాత్ లో ఓట్స్ లో వేసే క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, కొంచెం వెరైటీ టేస్ట్ ను అందిస్తాయి. మరి ఓట్స్ ఖారా బాత్ ఎలా తయారు చేయాలో చూద్దామా...

Oats Khara bath:Healthy Weight loss Recipe

కావలసిన పదార్థాలు:
ఓట్లు : కప్పు
ఉల్లిపాయ : 1 (సన్నగా తురమాలి)
టొమాటోలు : 2 (సన్నగా తరగాలి)
క్యారట్ తురుము : 1/2cup
క్యాప్సికమ్ తరుగు : 1/2cup
పచ్చి మిర్చి తరుగు : 1tbsp
అల్లం : వెల్లుల్లి పేస్ట్ : 1/2tsp
కారం : 1/2tsp
గరం మసాలా : 1/2tsp
పసుపు : 1/2tsp
కొత్తిమీర తరుగు : 3tbsp
నిమ్మరసం : 1tbsp
జీడిపప్పు పలుకులు : 10
ఉప్పు : రుచికి తగినంత
నెయ్యి : 1tbsp
సెనగపప్పు : 1tbsp
మినప్పప్పు : 1tbsp
ఆవాలు : 1/2tsp
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె : 2tsp
నెయ్యి : 2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ స్టౌ మీద ఉంచి వేడయ్యాక (నూనె వేయకూడదు) ఓట్స్ వేసి లైట్ గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి.
3. ఇప్పుడు సెనగపప్పు, మినప్పప్పు కూడా వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించాలి .
4. ఆ తర్వాత పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
5. రెండు నిముషాల తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.
6. ఇప్పుడు క్యారట్ తురుము, టొమాటో తరుగు జత చేసి అన్నీ బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి.
7. అలాగే క్యాప్సికమ్ తరుగు, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నీ కలిసేవరకు వేయించాలి
8. వేరొక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక ఉప్పు వేయాలి. (ఓట్స్, నీళ్లు రెండున్నర: 3 నిష్పత్తిలో) వేయించి ఉంచుకున్న ఓట్లు, టొమాటో మిశ్రమం వేసి ఆపకుండా కలపాలి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకొనే లోపు వేరొక పాన్ లో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి.
10. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలపాలి. జీడిపప్పులు, నెయ్యి వేసి కలిపి దించి మూత పెట్టాలి. సుమారు ఐదు నిమిషాలయ్యాక లంచ్ బాక్స్‌లో పెట్టాలి ఆలూ చిప్స్‌తో తింటే బాగుంటాయి.అంతే హెల్తీ ఓట్స్ కారాబాత్ రిసిపి రెడీ .

English summary

Oats Khara bath:Healthy Weight loss Recipe

When we think of some weight loss recipes, one ingredient that comes to mind is, oats. A lot of people including working professionals prefer to eat oats for breakfast. It is light, low in calories and filling as well. Most important, oats are healthy and has many nutritional benefits.
Desktop Bottom Promotion