For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్స్ సూప్ రిసిపి-హెల్తీ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్

|

రోజూ ఉదయం మనం తీసుకొనే అల్ఫాహారం, చాలా ముఖ్యమైనది. అందులోనే ఉదయం తీసుకొనే అల్పాహారం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. అటువంటి ఆహారాల్లో ఓట్స్ తో తయారు చేసే ఆహారాలు బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే సాధా ఓట్స్ ను పాలలో కలిపి తినడం కంటే కొంచెం వెరైటీగా కొంచె స్పైసీగా ఓట్స్ సూప్ తయారు చేసి తీసుకోవచ్చు.

ఓట్స్ సూప్ ను అధిక న్యూట్రీషియన్స్ మరియు కడుపు నింపే అల్పాహారంగా భావిస్తారు. ఈ ఓట్స్ రిసిపిలు బ్యాచులర్ కోసం బాగా పాపులర్ చెందినవి. ఓట్స్ తో వివిధ వెరైటీలను తయారు చేయడం చాలా సులభం మరియు మరియు బ్రెడ్ స్లైస్ తో తీసుకోవడం వల్ల ఇది హెల్తీ మీల్. ఈ సూప్ ను అన్ని వయస్సుల వారు తాగవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్తీ సూప్ ను తయారు చేసి స్విప్ చేసేయండి...

Oats Soup Recipe Breakfast

కావల్సిన పదార్థాలు:
ఓట్స్: 1cup
ఉల్లిపాయ: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి మిర్చి: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 1
లవంగం పొడి: చిటికెడు
పెప్పర్ పౌడర్: ఒక చిటికెడు
పాలు: 1cup
నీళ్ళు:1cup
ఆయిల్: 2tsp
కొత్తిమీర: గార్నిష్ కోసం
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక తవాలో నూనెను వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి.
2. అందులో తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మరొయు వెల్లుల్లి ముక్కలు వేసి, లైట్ గా వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించికోవాలి.
3. ఇప్పుడు వాటిలోనే ఓట్స్ కూడా వేసి, మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులో నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేయాలి. మీడియం మంట మీద ఈ మిశ్రమాన్నంతటినీ ఉడికించుకోవాలి.
5. ఎప్పుడైతే ఓట్స్ మెత్తగా మారేసమయం చూసి, అందులో పాలు, పెప్పర్ పౌడర్ వేసి, మరో నిముషం పాటు ఉడికించుకోవాలి.
6. అంతే ఓట్స్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి, ఈ క్రీమీ ఓట్స్ కు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Oats Soup Recipe Breakfast | కొంచెం వెరైటీ-కొంచెం స్పైసీ ఓట్స్ సూప్

Breakfast is the most important meal for the day, and one should always have a heavy breakfast. Oats is one of the best foods to have for breakfast. If you are not fond of the thick bland oats, here is a recipe for you to try out this morning.
Story first published: Monday, July 15, 2013, 10:37 [IST]
Desktop Bottom Promotion