For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆనియన్ టమోటో కోకనట్ మిల్క్ కుజంబు రైస్ స్పెషల్

|

కుజంబు అంటే స్టీవ్. ఈ వంటన్ ముఖ్యంగా సౌత్ ఇండియన్ వెజిటేరియన్ రిసిపి గా ఎక్కువగా వండుకుంటారు. ఈ వంటకు ముఖ్యంగా ఎక్కువగా ఉల్లిపాయలు, టమోటో మరియు తాజా కొబ్బరి పాలు ఉంటే చాలు.

ఈ స్పైసీ డిష్ ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది. కోకనట్ మిల్క్ యొక్క క్రీమీ స్ట్రక్చర్ నిజంగా అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇది ఒక ఫర్ఫెక్ట్ వింటర్ స్పెషల్ డి. దీన్ని వేడి వేడి ఇడ్లీ మరియు రైస్ కు కాంబినేషన్ గా వడ్డించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త వంటను ట్రై చేయండి...కొత్త టేస్ట్ ను ఆస్వాదించండి.....

Onion Tomato Coconut Milk Kuzhambu

కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయ : 1( సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటోలు: 2cups( సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4
పసుపు: 1/4tsp
కారం: 1/2tsp
చింతపండు గుజ్జు: 1/2tsp
ధనియాలపొడి: 1/2tsp
జీలకర్రపొడి: 1/2tsp
చిక్కటి కొబ్బరి పాలు: 2cups
ఆవాలు: 1/4tsp
ఉద్దిపప్పు: 1/4tsp
కొత్తిమీర తరుగు: గార్నిష్ చేయడానికి సరిపడా
నూనె: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి.
2. తర్వాత నూనె వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఉద్దిపప్పు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే కట్ చేసిపెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు మరియు ఉప్పు వేసి, వేగించుకోవాలి.
4. ఉల్లిపాయలు మెత్తగా వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పౌడర్స్ అన్నీ వేసి, చింతపులుసు కూడా జోడించాలి. అలాగే ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
6. మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉడికించడం వల్ల ఉల్లిపాయలు ఉడికి, మసాల యొక్క పచ్చివాసన పోయే వరకూ ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులో కొబ్బరి పాలు పోసి మిక్స్ చేసి ఒక నిముషం ఉడికించుకోవాలి.
8. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆనియన్ టమోటో, కోకనట్ మిల్క్ కుజంబు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Onion Tomato Coconut Milk Kuzhambu

Kuzhambu means a stew. This particular South Indian vegetarian recipe is made with onions and tomatoes which are cooked in coconut milk.
Story first published: Monday, December 15, 2014, 17:36 [IST]
Desktop Bottom Promotion