For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలర్-మష్రుమ్ -ఫ్లేవర్డ్ అండ్ టేస్టీ రిసిపి

|

ఏదైనా సరే స్పెషల్ గా వండాలనుకొన్నప్పుడు. చాలా సింపుల్ గా ఉండే వంటలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. మరియు తేలికగా, త్వరగా తయారు చేసుకొనే విధంగా ఎంపిక చేసుకోవాలి. ఇండియన్ కుషన్ లో చాలా తేలికైనటువంటి వంటకాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో పాలక్ మష్రుమ్ కర్రీ ఒకటి. ఇటువంటి వెజిటేరియన్ రిసిపి అంటే పాలకూర మరియు మష్రుమ్ రెండింటి కాంబినేషన్లో, కొన్ని మసాలా దినుసులను ఉపయోగించి చేయడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

ఈ రెండింటి కాంబినేషన్ లో తయారు చేయడం చాలా సింపుల్. అందుకు ముందుగా పాలక్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ వంటలో ప్రదాన పాత్ర ఈ పేస్ట్ తో ఓ అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఈ పేస్ట్ కు కొన్ని సింపుల్ మసాలా దినుసులను మూలికలను కలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు మష్రుమ్ అందుబాటులో లేకుంటే వాటి ప్లేస్ లో బంగాళదుంపలు లేదా టోఫును ఉపయోగించుకోవచ్చు. మరి పాలక్ మష్రుమ్ కాంబినేషన్ రిసిపి ఎలా తయారు చేయాలో చూద్దాం...

Palak With Mushroom Curry Recipe

కావల్సిన పదార్థాలు:
బటన్ మష్రుమ్(పుట్టగొడుగులు): 15
ఉల్లిపాయ:1(సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
కొత్తిమీర పొడి: 1tsp
గరం మసాలా పొడి: ½tsp
నిమ్మరసం: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1/2cup

పాలక్ పేస్ట్ కోసం:
పాలకూర: 1కట్ట (శుభ్రం చేసి కడిగి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: ఒక అంగుళం
పచ్చిమిరపకాయలు: 2-4
దాల్చిన చెక్క: 1
గ్రీన్ యాలకులు: 4
లవంగాలు : 4
స్టార్ యానీస్: 1
కొత్తిమీర: ½cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా బటన్ మష్రుమ్ ను నీటిలో శుభ్రంగా కడిగి, తర్వాత వాటిని రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాలక్ పేస్ట్ కోసం సిద్దం చేసుకొన్న మసాలాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు కలపకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో, జీలకర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పుట్టగొడుగులను 5-6నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పాలక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
6. తర్వాత అందులోనే ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా పౌడర్, వేసి మరో మూడు నిముషాలు వేగించుకోవాలి.
8. ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి పది నిముషాల పాటు మీడియం మంటలో ఉడికించాలి.
9. మష్రుమ్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి, స్టౌవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రిసిపి అన్నం, మరియు రోటీలకు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

English summary

Palak With Mushroom Curry Recipe | పాలర్-మష్రుమ్ -ఫ్లేవర్డ్ అండ్ టేస్టీ రిసిపి

Preparing something unique and delicious with some very simple ingredients is the best part of our Indian cuisine. Palak with mushroom curry is one such vegetarian recipe. The combination of palak and mushrooms with a blend of fragrant spices makes this recipe burst with complex flavours.
Desktop Bottom Promotion