For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ స్పైసీ : ఆలూ మటర్ పనీర్ రిసిపి

|

రోజూ ఒకేరకమైన వంటలు తిని బోరుకుడుంటే, ఒక చిన్న మార్పు చేసి, వంటలు తయారుచేయడానికి ప్రయత్నించండి. రెగ్యులర్ వంటలే అయినా ఒక చిన్న మార్పుల వల్ల ఆ వంట యొక్క టేస్టే మారిపోతుంది.

అలాంటి డిఫరెంట్ వంటకాల్లో ఆలూ మటర్ పనీర్ ఒకటి. సాధారణంగా ఆలూ మటర్ రిసిపి తయారుచేసే ఉంటారు. ఈ కాంబినేషన్ కు కొద్ది పనీర్ చేర్చితే మరింత టేస్ట్ గా ఉంటుంది. కొన్ని మసాలా దినుసులు మరియు డిఫరెంట్ టేస్ట్ కోసం మేతి ఆకుల చేర్చి తయారుచేయడం వల్ల మంచి రంగు ఫ్లేవర్ తో నోరూరిస్తుంటుంది. ఈ గ్రేవీ రిసిపిని సాప్ట్ పనీర్ బటర్ కుల్చా, తందూరి రోటి తో వడ్డిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Paneer Aloo Matar Recipe: Tasty and Spicy

కావల్సిన పదార్థాలు:
ఫ్రెష్ పచ్చిబఠానీలు: 1/2cup
పనీర్ క్యూబ్స్: 1/3cup
బంగాళదుంప: 1(ముక్కలుగా కట్ చేసి, ఉడికించినవి)
ఉల్లిపాయ : 1 సన్నగా తరిగినవి
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ : 1tbsp
టమోటో: 2(సన్నగా కట్ చేసుకోవాలి.
జీడిపప్పు: 1tbsp(సన్నగా కట్ చేసుకోవాలి)
మేంతి ఆకు : 2tsp(డ్రై అయినది)
గరం మసాలా పౌడర్: 1/2tsp
ధనియలా పౌడర్: 1/2tsp
కారం: 1/2tsp
పసుపు: 1/4tsp
నూనె: సరిపడా
ఉప్పు : రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా టమోటోలు మరియు జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో బంగాళదుంపముక్కలు వేసి, మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు షాలో ఫ్రై చేసి ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి.
3. అదే పాన్ లో పన్నీర్ ముక్కలు కూడా వేసి షాలో ఫ్రై చేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
6. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకూ వేగించి తర్వాత అందులో టమోటో పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.
7. మొత్తం మిశ్రమాన్ని 5నిముషాలు పాటు ఉడికించాలి. ఉండేసమయంలోనే ఉప్పు, మెంతి ఆకు(చేత్తో నలిపి వేయాలి), గరం మసాల, కారం, ధనియాల పొడి, మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
8. మొత్తం మసాలా మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా షాలో ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్, బంగాళదుంప ముక్కలు వేయాలి. అలాగే పచ్చిబఠానీలను కూడా వేసి 1 నిముషం బాగా మిక్స్ చేయాలి .
9. ఇప్పుడు అందులో 1/2కప్పు నీళ్ళుపోసి మీడియం మంట మీద ఉడకించుకోవాలి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడ మంటను తగ్గించి గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి.
10. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ గ్రేవీ ఒక 15నిముషాలు అలాగే ఉంచాలి. అంతే ఆలూ మటర్ పనీర్ కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి వడ్డించాలి అంతే.

English summary

Paneer Aloo Matar Recipe: Tasty and Spicy

Have a delicious change to routine aloo matar by adding paneer (cottage cheese) to it. Learn how make this classic Indian curry with this easy aloo matar paneer recipe.
Desktop Bottom Promotion