For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నీర్ బుర్జి: డిన్నర్ స్పెషల్

|

వంటల్లో పనీర్ వంటలు చాలా టేస్ట్ గా నోరూరిస్తుంటాయి. ముఖ్యంగా ఇండియాలో నార్త్ స్టేట్స్ లో ఎక్కువగా వండుతారు. పనీర్ ను వివిధ రకాలుగా డిఫరెంట్ స్టైల్స్ లో వండుతారు. అందులో ఒకటి పనీర్ బుర్జీ.

పన్నీర్ బుర్జీ తయారుచేయడం చాలా సులభం. ఈ పనీర్ బుర్జీ, బ్రెడ్ మరియు పరాటా రెండికీ ఒక చక్కటి కాంబినేషన్. ఇండియాలో సౌత్ స్టేట్స్ లో పన్నీర్ బుర్జ్ ను దోసలో స్టఫ్ చేసి పనీర్ దోసను తయారుచేస్తారు. మరి ఈ నోరూరించే పనీర్ బుర్జ్ ను మీరు రుచి చూడాలంటే, క్రింది తయారుచేసే పద్దతిని తెలుసుకోవాల్సిందే...

Paneer Bhurji Recipe For Dinner
కావల్సిన పదార్థాలు:
పనీర్ - 2 cups (గుజ్జు)
జీలకర్ర - 2 tsp
ఉల్లిపాయలు - 2 (కట్ చేసినవి)
టమోటో -1 (తరిగినవి)
గరం మసాలా - 1tbsp
పసుపు - 1 tsp
కారం పొడి - 1 tsp
పచ్చిమిర్చి - 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ధనియాల పొడి - 2tsp
నూనె - 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.
3. ఇప్పుడు అలాగే అందులో జీలకర్ర, పసుపు, కారం, ధనియాలా పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి.
4. ఇవన్నీ బాగా నూనెలో వేయించుకొన్న తర్వాత, అందులో టమోటో ముక్కలు వేయాలి వేయించుకోవాలి.
5. 5నిముషాల తర్వాత గుజ్జులా చేసుకొన్న పనీర్ ను అందులో వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
6. కొద్దిసేపు వేయించిన తర్వాత పాన్ కు మూత పెట్టి మరో 10 నిముషాలు వేయించుకోవాలి.
7. మద్యలో ఒక సారి మూత తీసి, గరం మసాలా మరియు ఉప్పును చిలకరించి మరోసారి మిశ్రమాన్నంతా మిక్స్ చేయాలి. అంతే పనీర్ బుర్జీ రెడీ.

English summary

Paneer Bhurji Recipe For Dinner

One of the most loved ingredients in India is dishes made out of cottage cheese, in other words, paneer. In Northern parts of India, it is not uncommon to find paneer as an ingredient in at least one dish in a day. The paneer bhurji, a popular preparation by Indians, has become famous worldwide too.
Story first published: Tuesday, February 18, 2014, 17:32 [IST]
Desktop Bottom Promotion