For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ బట్టర్ మసాలా : వెజిటేరియన్ స్పెషల్ రిసిపి

|

ఈ రోజు మీకు ఒక రుచికరమై, మరియు క్రీమీ పనీర్ రిసిపిని పరిచయం చేస్తున్నా. పనీర్ బట్టర్ మసాలా నార్ ఇండియాలో చాలా ఫేమస్. ఈ సాఫ్ట్ పనీర్ క్యూబ్స్ ను చాలా రుచికగా మరియు బట్టర్ టమోటో గ్రేవీ మరియు ఇతర ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు.

ఈ పనీర్ మసాలా దినుసులతో బాగా మెత్తగా ఉడికించడం వల్ల నోట్లో పెట్టుకోగానే క్రీమిగా కరిగిపోతుంది చాలా అద్భుతమైన రుచని, మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. ముఖ్యంగా ఈ రిసిపి వెజిటేరియన్ మసాలా రిసిపిగా అందరినీ నోరూరిస్తుంటుంది. మరి దీన్నీ ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
పనీర్: 500gms(క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి)
బట్టర్: 4tbsp
ఆయిల్: 1tsp
బే ఆకు :1
లవంగాలు: 2
చెక్క : 1
ఎండు మిర్చి: 2 (మ్యదకు కట్ చేయాలి)
ధనియాలు: 2tbsp(పొడి చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో : 3(గుజ్జులా తయారుచేసుకోవాలి)
ధనియాల పొడి: 1tsp
కారం: 1tsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మెంతి: 1tsp (చూర్ణం)
ఫ్రెష్ క్రీమ్: 1tbsp
నీళ్ళు: ½cup

Paneer Butter Masala: Veg Special Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బటర్ మరియు ఒక టేబుబుల్ స్పూన్ నూనె పాన్ లో వేసి వేడి చేయాలి. తర్వాత అందులో బిర్యాని ఆకు, రెండుగా తుండి పెట్టుకొన్న ఎండుమిర్చి, పొడి చేసుకొన్న ధయాలు, చెక్క, లవంగాలు వేసి ఒక నిమషం తక్కువ మంట మీద వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో అల్లం వెల్లు్లి పేస్ట్ కూడా వేసి మరో 2, 3నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో పసుపు, కారం, ధనియాల పొడి, మరియు టమోటో పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత అందులో పనీర్ క్యూబ్ లను వేసి మిశ్రమాన్నంతటిన నిధానంగా మిక్స్ చేస్తూ బాగా వేగించుకోవాలి.
6. 3,4నిముషాల తర్వాత అందులో నీళ్ళు, ఉప్పు కూడా చేర్చి బాగా మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన మెంతి ఆకులు కూడా వేసి మిక్స్ చేసి తక్కువ మంట మీద 5,6నిముషాలు ఉడికించుకోవాలి.
8. ఒకసారిగా మిశ్రమం అంతా మెత్తగా ఉడికిన తర్వాత అందులో స్టౌ ఆఫ్ చేసి మిగిలిన బట్టర్ మరియు తాజా క్రీమ్ తో గార్నిస్ చేయాలి .అంతే పనీర్ బట్టర్ వెజ్ రిసిపి రెడీ.

English summary

Paneer Butter Masala: Veg Special Recipe

Today we have a creamy and delicious paneer recipe. Paneer butter masala is a popular recipe which hails from North India. The soft paneer cubes are cooked in a rich and buttery tomato gravy with a fine blend of Indian spices.
Story first published: Monday, December 2, 2013, 12:02 [IST]
Desktop Bottom Promotion