For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ విత్ రోటీ

|

పన్నీర్ తో తయారు చేసే వంటలంటే చాలా వరకూ అందరీకి ఇష్టమే. ఇండియాలో చాలా వరకూ శాఖాహారాలు ఎక్కువగా తయారు చేస్తుంటారు . దరిదాపు దీని రుచి చికెన్ రుచిని కలిగి ఉంటుంది . ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ మరియు అధిక న్యూట్రీషియన్స్ ను కలిగి ఉంటుంది. పన్నీర్ క్యాప్సికమ్ ఇండియన్ రిసిపి దేశంలో బాగా ప్రసిద్ది చెందింది. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీని వివిధ రకాలుగా వండుతుంటారు.

సౌత్ ఇండియన్ కర్రీకి మస్టర్డ్ మరియు కరివేపాకు చేర్చడం వల్ల రుచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్ సైడ్ జీలకర్రతో మరియు కొత్తిమీరతో తయారు చేస్తారు.ఇతర ఇండియన్ కర్రీస్స్ తో పోల్చితే ఈ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అంతే స్పైసీగా ఉండదు. చూడటానికి చాలా సింపుల్ గా మరియు జీర్ణ అవ్వడానికి తేలికగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. మరీ ఈ నార్త్ ఇండియన్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం.

Paneer Capsicum Curry With Roti

పన్నీర్:200 grams(cut into cubes)
ఉల్లిపాయ:1 (sliced)
క్యాప్సికమ్:1 (diced)
టమోటో:1 (chopped)
పచ్చిమిర్చి:2 (slit)
జీలకర్ర:1/2 tsp
కారం:1/2 tsp
జీలకర్ర:1tsp
ధనియాలపొడి:1/2 tsp
నూనె:1tbsp
కొత్తిమీర:2 stalks (chopped)
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి, పన్నీర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
2. పన్నీర్ ఎక్కువ సేపు ఎక్కువ మంట మీద ఫ్రై చేయకూడదు. అలా చేస్తే పన్నీర్ గట్టిగా మారుతుంది.
3. ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్ లోనికి తీసుకొని, మిగిలిన నూనెలోనే జీలకర్ర వేసి తక్కువ మంట మీద రెండు నిమిషాలు వేగించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఒక నిముషం తర్వాత ఉల్లిపాయలు వేసి, సన్నని మంట మీద ఐదు నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే క్యాప్సికమ్ కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించాలి. తర్వాత టమోటో ముక్కలు, ఉప్పు వేసి వేగించాలి. టమోటో మెత్తబడే వరకూ వేగించాలి.
5. ఇప్పుడు పౌడర్ మసాలాలు అంటే కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలబెట్టి ఒక నిముషం తర్వాత ఒకకప్పు నీళ్ళు పోసి, కర్రీని బాగా ఉడికించాలి.
6. కర్రీ చిక్కబడే సమయంలో ముందుగా వేగించుకొన్న పన్నీర్ ముక్కలను వేసి మరో ఐదు నిముషాలు ఉడికించాలి. అంతే దింపుకొనే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే పన్నీర్ కాప్సియం కర్రీ రెడీ.

English summary

Paneer Capsicum Curry With Roti | పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ విత్ రోటీ

Most paneer recipes are loved in the Indian subcontinent. Paneer for the vast majority of vegetarians in India is a replacement for chicken. It is protein rich and nutritious. Paneer capsicum curry is an Indian recipe that is popular across the country. Paneer capsicum curry can be made in a number of ways. Down South, they add curry leaves and mustard seeds to this Indian curry. And in the North, paneer capsicum curry is made with cumin seeds and coriander leaves.
Story first published: Monday, March 25, 2013, 11:59 [IST]
Desktop Bottom Promotion