For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ కోకనట్ గ్రేవీ రిసిపి: తెలుగు వంటలు

|

పనీర్ లేదా కాటేజ్ చీజ్ ఒక ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్ట్. వెజిటేరియన్స్ కు పనీర్ అత్యంత హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్ . ఈ డైరీ ప్రొడక్ట్ ను వివిధ రకాల వంటకాల్లో జోడించడం అంటే వారికి మరింత ఇష్టం. ఈ రోజు మీకు ఒక రుచికరమై, మరియు క్రీమీ పనీర్ కోకనట్ గ్రేవీ రిసిపిని పరిచయం చేస్తున్నాం. పనీర్ కోకనట్ గ్రేవీ రిసిపి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. సాఫ్ట్ పనీర్ క్యూబ్స్ ను చాలా రుచికగా మరియు బట్టర్ టమోటో గ్రేవీ మరియు ఇతర ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు.

ముఖ్యంగా ఇండియన్ ఫెస్టివల్స్ కు పనీర్ ను ఎక్కువగా వండుకుంటుంటారు . మరి మీకు కూడాపనీర్ తో తయారుచేసే వంటలంటే ఇష్టపడుతున్నట్లైతే, పనీర్ కోకనట్ గ్రేవీని ఎలా తయారుచేస్తారో చూద్దాం. ఈ డిష్ స్పైసీగా...స్వీట్ గా పొట్టనింపుతుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Paneer Coconut Gravy Recipe : Telugu Vantalu

కాటేజ్ చీజ్ : 300grms
ఉల్లిపాయలు : 4
వెల్లుల్లి రెబ్బలు: 6-8
అల్లం: కొద్దిగా
టమోటోలు: 5
కొత్తిమీర: కొద్దిగా
ఎండుమిర్చి: 4
జీలకర్ర: 1/2 tsp
ధనియాలపొడి: 2 tsp
కారం: 1 tsp
పంచదార: 1 tsp
వేరుశెనగలు: 1/4cup(పౌడర్ చేసుకోవాలి)
పాలు: 1 cup
నిమ్మరసం: 1 tsp
బట్టర్ లేదా నెయ్యి: 3 tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పనీర్ ను నచ్చిన షేపులో కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ, టమోటోట, అల్లం వెల్లుల్లిని మెత్గగా పేస్ట్ చేసుకోవాలి
3. అలాగే కొత్తిమీర, ఎండుమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి
4. వేరుశెనగలు కూడా వేయించుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి .
5. ఇప్పుడు కొబ్బరి పాలను తయారుచేసుకోవడానికి...ఫ్రెష్ గా ఉండే కొబ్బరిని సన్నగా తురుముకోవాలి. తురుమును మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అందులో ఒక గ్లాస్ నీరు మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకుంటే కోకనట్ మిల్క్ రెడీ.
6. ఇలా అన్ని సిద్దం చేసుకన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నెయి వేసి వేడి చేయాలి.
7. నెయ్యి వేడెక్కాక, అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
8. ఉల్లిపాయ మెత్తబడి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక్క నిముషం వేగించుకోవాలి.
9. కొద్దిసేపటి తర్వాత అందులో టమోటో మరియు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉడికించడం వల్ల నూనె సెపరేట్ అవుతుంది.
10. నూనె పైకి తేలుతున్న సమయంలో ధనియాలపొడి, కారం, ఉప్పు, పంచదార పొడి కొబ్బరి పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
11. చివరగా పనీర్ ముక్కలు వేసి గ్రేవీ చిక్కబడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. పనీర్ మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని సర్వ్ చేయాలి. అంతే పనీర్ కోకనట్ గ్రేవీ రెడీ.

English summary

Paneer Coconut Gravy Recipe : Telugu Vantalu

If you have coconut (or coconut milk) in your kitchen, and wondering a good way to use it in a recipe, Paneer Coconut Gravy Recipe is a great option. This is a semi-dry preparation of paneer without need of many ingredients.
Story first published: Tuesday, November 17, 2015, 13:09 [IST]
Desktop Bottom Promotion