For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ కట్ లెట్-మాన్ సూన్ స్పెషల్ స్నాక్

|

వేడి వేడి కట్ లెట్, ఒక కప్పు టీ, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ !సంతోషకరమై సమయాన్ని గడపడానికి ఇంతకంటే మరేం కావాలి. వర్షాకాలంలో ఇలాంటి క్రిస్పీ వంటలు రుచి చూడటానికి మంచి సమయం.

పనీర్ ఇటు వెజిటేరియన్ కు అటు నాన్ వెజిటేరియన్స్ కు ఇష్టమైన వంటకం. వారికోసం ఇక్కడ ఒక స్పైసీ-నోరూరించే క్రిస్పీ వంటకం. ఈ వంటకాన్ని వివిధ రకాలుగా వండుకోచ్చు. ఈ కట్ లెట్ ను డీప్ ప్రై చేసుకోవచ్చే లేదా బేక్ చేసుకోవచ్చు. ఈ వంటకానికి ఒక ప్రత్యేకత ఉంది. పనీర్ మిశ్రమాన్ని బ్రెడ్ పొడిలో డిప్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. మరి ఈ క్రిస్పీ కట్ లెట్ ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

Paneer Cutlet

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250grms
బ్రెడ్ స్లైస్: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
ఉల్లిపాయ : 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1/4tsp
ఛాట్ మసాలా: 1tsp
పెప్పర్ పౌడర్: 1/2tsp
పుదీనా ఆకులు: 2tbsp(సన్నగా తరగాలి)
బ్రెడ్ పొడి: 1cup
మైదా: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp
నీళ్ళు: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక నిముషం నీళ్ళలో డిప్ చేయాలి. తర్వాత ఎక్సెస్ వాటర్ ను పిండేసేయాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పనీర్, తడి బ్రెడ్ స్లైస్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఛాట్ మసాలా, పెప్పర్ పౌడర్, ఉప్పు, పుదీనా అన్నీ వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
3. తర్వాత కట్ లెట్ చేసుకొనేంత పదార్థం చేతిలోకి తీసుకొని బాల్స్ లో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరచేతిలో పెట్టుకొని కట్ లెట్ లా వత్తుకోవాలి.
4. తర్వాత ఒక గిన్నెలో మైదా, కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా జారుడుగా కలుపుకోవాలి.
5. తర్వాత బ్రెడ్ ను ఒక ప్లేట్ లో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వత్తుకొన్న కట్ లెట్ ను తీసుకొని, బ్రెడ్ పొడిలో అన్ని వైపులా అద్దుకోవాలి. ఇలా అన్నింటినీ ఒకేసారి రెడీ చేసుకోవచ్చు. లేదా నూనెలో వేసే ముందు ఒక్కోదాన్ని ఒక్కోసారి బ్రెడ్ పొడిలో అద్దుకోవచ్చు.
6. తర్వాత పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో సిద్దం చేసి పెట్టుకొన్న కట్ లెట్ ను కాగే నూనెలో వేసి మీడియం మంట మీద నిదానంగా అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి.
7. అంతే పనీర్ కట్ లెట్ బ్రౌన్ కలర్ లోకి మారగానే స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా చట్నీ లేదా కెచప్ తో సర్వ్ చేయాలి.

English summary

Paneer Cutlet: Monsoon Special Recipe


 Hot cutlets, with a cup of tea and gossips with a bunch of friends! Nothing can beat this fun. With rains pouring down, it is the perfect time for frying up some crispy and delicious cutlets.
Story first published: Thursday, June 20, 2013, 16:29 [IST]
Desktop Bottom Promotion